Breaking: ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు.. అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాల అధ్యయనానికి కమిటీ

|

Feb 11, 2021 | 7:43 PM

ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు వెలువరించింది. అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాల అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేసింది. సీఎస్ నేతృత్వంలో 9 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటైంది.

Breaking: ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు.. అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాల అధ్యయనానికి కమిటీ
AP-Government-
Follow us on

ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు వెలువరించింది. అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాల అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేసింది. సీఎస్ నేతృత్వంలో 9 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. సభ్యులుగా శాసనసభ కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శి, పురపాలకశాఖ కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, ఎంఆర్‌డీఏ కమిషనర్‌, సీఎం ముఖ్య సలహాదారు వ్యవహరించనున్నారు. పూర్తిగా అధ్యయనం చేసి ఏ భవనాలు అవసరమో కమిటీ తేల్చనుంది. భవనాలు పూర్తి చేయనిపక్షంలో ప్రత్యామ్నాయ మార్గాలపై అధ్యయనం చేయనున్నారు. ఖజానాపై భారం తగ్గించే మార్గాలపై అధ్యయనానికి ప్రభుత్వం ఆదేశించింది.

ఇక ఇటీవల అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ప్రాజెక్టులపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. కరకట్ట రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించే ప్రతిపాదనకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం దాదాపు రూ.150 కోట్లు ఖర్చవుతుందని వారు తెలపగా.. సాధ్యమైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. అమరావతి ప్రాంత అభివృద్ధికి ఈ రోడ్డు కీలకంగా మారుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. కరకట్ట రోడ్డుతో పాటు దానికి అనుసంధానంగా ఉన్న రోడ్లు కూడా మెరుగు పరచాలని సీఎం ఆదేశించారు. అలాగే సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును మెయిన్‌ రోడ్డుకు అనుసంధానం చేసే పనులుకూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఇక గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును త్వరగా కంప్లీట్ చేసి ఫ్లాట్లను రెడీ చేయాలన్నారు. ఇక అమరావతి నిర్మాణంలో భాగంగా అసంపూర్తిగా ఉన్న భవనాలను వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం.. తాజాగా వాటిలో ఏవి ఉపయోగపడతాయో తెలుసుకోడానికి కమిటీని ఏర్పాటు చేశారు.

Also Read:

Vizag Steel Plant: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు.. 5 దశాబ్దాల తర్వాత మళ్ళీ అదే నినాదం.. తెర వెనుక అసలు కథ ఇదే!

ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం.. రేగు పండ్ల కోసం వెళ్లి.. వాగులో పడి ముగ్గురు బాలికలు మృతి