Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు.. అధికారికంగా స్పందించిన ఏపీ సర్కార్‌.

|

Feb 22, 2023 | 11:33 AM

సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఎప్పుడు, ఏ అంశం వైరల్‌ అవుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్లు పరిస్థితి మారింది. సోషల్‌ మీడియాతో సమాచారం వేగంగా అందుతోందని సంతోషించాలా.? తప్పుడు సమాచారం సర్క్యూలేట్‌ అవుతోందని..

Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు.. అధికారికంగా స్పందించిన ఏపీ సర్కార్‌.
Andhra Pradesh
Follow us on

సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఎప్పుడు, ఏ అంశం వైరల్‌ అవుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్లు పరిస్థితి మారింది. సోషల్‌ మీడియాతో సమాచారం వేగంగా అందుతోందని సంతోషించాలా.? తప్పుడు సమాచారం సర్క్యూలేట్‌ అవుతోందని బాధపడలా తెలియని పరిస్థితి ఉంది. ఇక ప్రభుత్వాలపై కూడా తప్పుడు ప్రచారం జరగడం ఇటీవల కామన్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఆంధప్రదేశ్‌ ప్రభుత్వంపై నెట్టింట జరుగుతోన్న తప్పుడు ప్రచారంపై ఫ్యాక్ట్‌ చెక్‌.ఏపీ.జీఓవీ.ఇన్‌ అనే ట్విట్టర్‌ పేజీ ద్వారా ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తోంది.

ఇందులో భాగంగానే తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వార్తపై ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. ‘సోషల్‌ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని గుర్తించి సాధారణ పరిపాలన శాఖకు పంపాల్సిందిగా ఉత్తర్వులు జారీ’ అంటూ ఓ పోస్ట్ వైరల్‌ అవుతోంది. అంతటితో ఆగకుండా ఓ సర్క్యూలర్‌ను కూడా పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌ కాస్త వైరల్‌గా మారడంతో ప్రభుత్వం అధికారికంగా స్పందించింది.

ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిందని ప్రచారం జరుగుతోన్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న సదరు సర్క్యూలర్‌లు గతంలో జమ్ముకశ్యీర్‌ ప్రభుత్వం జారీ చేసిందని పేర్కొంది. ఈ పోస్టుల్లో ఎలాంటి నిజం లేదని రాసుకొచ్చింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..