కర్నూలు రోడ్డు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన

కర్నూలు ప్రమాద ఘటనలోని మృతుల కుటుంబాలకు ఏపీ సర్కార్ రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది...

కర్నూలు రోడ్డు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన

Updated on: Feb 14, 2021 | 3:24 PM

Kurnool road accident: కర్నూలు ప్రమాద ఘటనలోని మృతుల కుటుంబాలకు ఏపీ సర్కార్ రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున ముఖ్యమంత్రి జగన్ ఆర్థిక సాయం ప్రకటించారు. ఇప్పటికే కర్నూలు గవర్నమెంట్ ఆస్పత్రికి 14 మంది మృతదేహాలను తరలించారు. మృతుల బంధువులు ఆసుపత్రికి చేరుకున్నారు. కాసేపట్లో మృతదేహాలకు వైద్యులు శవపరీక్ష నిర్వహించనున్నారు.

కర్నూలు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మదార్‌పురం వద్ద హైదరాబాద్‌- బెంగళూరు నేషనల్ హైవేపై 18 మందితో ప్రయాణిస్తోన్న టెంపో వాహనం వాహనం అదుపుతప్పి డివైడర్‌ను దాటి అవతలి వైపు ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టెంపోలో ప్రయాణిస్తున్న 14 మంది స్పాట్‌లోనే ప్రాణాలు విడిచారు. మృతుల్లో 8 మంది మహిళలు, ఐదుగురు పురుషులు, ఒక బాలుడు ఉన్నారు. మరో నలుగురు చిన్నారులు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

రోడ్డు ప్రమాద ఘటనపై సీఎం జగన్ తీవ్ర  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై ప్రధాని సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Also Read:

Kurnool Road Accident: కర్నూలు ప్రమాదంపై దిగ్భ్రాంతికర విషయాలు.. చిన్న పొరపాటుకు 14 మంది బలి..

9 నెలల గర్భంతో ఎన్నికల బరిలోకి.. ఓటు వేసిన అనంతరం బిడ్డకు జననం.. ఆపై విజయం..