Nellore Steel: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. నెల్లూరు జిల్లాలో స్టీల్‌ప్లాంట్‌కు గ్రీన్‌సిగ్నల్.. జిందాల్‌ కంపెనీకి భూముల కేటాయింపు

|

Jul 15, 2021 | 5:28 PM

జిందాల్‌ స్టీల్‌ ఆంధ్ర లిమిటెడ్‌ కంపెనీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భూములు కేటాయిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

Nellore Steel: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. నెల్లూరు జిల్లాలో స్టీల్‌ప్లాంట్‌కు గ్రీన్‌సిగ్నల్.. జిందాల్‌ కంపెనీకి భూముల కేటాయింపు
Ap Govt. Allots Land To Jindal Steel Company
Follow us on

AP Govt. allots land to Jindal Steel Company: నెల్లూరు జిల్లాలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. తమ్మినపట్నం మోమిడి పరిధిలో రూ.7,500 కోట్లతో 11.6 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న స్టీల్‌ప్లాంట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. గతంలో కిన్నెటా పవర్‌కు ఇచ్చిన భూములను ప్రభుత్వం రద్దు చేసి వాటిని జిందాల్‌ సంస్థకు కేటాయించింది. ఈ మేరకు జిందాల్‌కు 860 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్టీల్‌ప్లాంట్‌ ద్వారా 2,500 మందికి ప్రత్యక్షంగా.. 15వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

జిందాల్‌ స్టీల్‌ ఆంధ్ర లిమిటెడ్‌ కంపెనీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భూములు కేటాయిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం 860 ఎకరాల భూములు కేటాయించింది. నెల్లూరు జిల్లా చిలుకూరు మండలం మొమిడిలో ఈ భూములు కేటాయించింది. ప్లాంట్‌ విస్తరణకు వచ్చే నాలుగేళ్లలో 3వేల ఎకరాలు అవసరమని అంచనా వేస్తున్నారు. మొత్తం 7,500 కోట్ల రూపాయల పెట్టుబడితో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం జరగనుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రీయల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ కార్పొరేషన్‌ (ఏపీఐఐసీ)కు భూముల కేటాయింపునకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also….  AP Govt: అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన మంత్రి కన్నబాబు.. వారందరికీ ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయంటూ..