ఆర్టీసీ ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. ఇక బస్సులో ప్రయాణం మరింత సులభతరం

ఏపీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులో రద్దీ, పోల్యూషన్‌ను తగ్గించేందుకు కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను అందించనుంది. పీఎం ఈ-బస్‌ సేవా పథకం కింద తొలి విడతగా ఏపీకి కేంద్ర ప్రభుత్వం మొత్తంగా 750 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నట్టు ఏపీ సీఎస్‌ అధికారులకు తెలిపారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు.

ఆర్టీసీ ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. ఇక బస్సులో ప్రయాణం మరింత సులభతరం
Electric Buses Andhra Pradesh

Updated on: Mar 26, 2026 | 1:35 PM

ఏపీలో ఆర్టీసీ బస్సులో ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు, ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం ఈ-బస్ సేవా పథకం కింద రాష్ట్రానికి ఎలక్ట్రిక్ బస్సులను అందించాలని కోరింది. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం తొలి విడతగా రాష్ట్రానికి 750 బస్సులను అందించేందుకు నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ బస్సులు రాష్ట్రానికి చేరనున్నాయని కేంద్రం తెలిపింది. దీంతో బస్సుల వినియోగానికి అన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.

అయితే కేంద్రం అందించే ఈ 750 బస్సులను రాష్ట్రవ్యాప్తంగా 11 నగరాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్టు అధికారులు తెలిపారు. కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింట్ స్టేషన్‌లు, బస్సుల నిర్వాహణకు అవరమైన సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సీఎస్ అధికారులకు సూచించారు. ఇక ఈ ఎలక్ట్రిక్ బస్సులకు కావాల్సిన మౌలిక వసతుల కోసం మొత్తం 12 డిపోల పరిధిలో 129.51 కోట్లు వెచ్చిస్తున్నట్టు రవాణాశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి తెలిపారు. ఈ మొత్తం నిధుల్లో 60 శాతం నిధులను కేంద్ర భరించనుండగా మిగతా 40 శాతం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుందని తెలిపారు.

కేంద్రం నుంచి తొలి విడతలో భాగంగా వచ్చే ఈ 750 బస్సులను విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, అమరావతి, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us