Andhra Pradesh: ఏపీలోని రైతులకు బిగ్ రిలీఫ్.. బ్యాంక్ రుణాలు చెల్లించనక్కర్లేదు..

ఏపీలోని రైతులకు బ్యాంకులు గుడ్ న్యూస్ అందించాయి. రైతుల రుణాలపై బ్యాంకర్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఏపీ ప్రభుత్వం ఇటీవల కరువు మండలాలను ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా బ్యాంకర్లు విజయవాడలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రైతుల రుణాలపై చర్చించారు. అనంతరం కీలక నిర్ణయం తీసుకున్నారు.

Andhra Pradesh: ఏపీలోని రైతులకు బిగ్ రిలీఫ్.. బ్యాంక్ రుణాలు చెల్లించనక్కర్లేదు..
Farmers Loan

Updated on: Oct 08, 2026 | 10:04 PM

ఎల్‌నివో ప్రభావం క్రమంలో ఏపీలోని రైతులకు శుభవార్త. రైతుల బ్యాంక్ రుణాలను రీషెడ్యూల్ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ నాటికి స్టాండర్డ్‌ కేటగిరీలో ఉండి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతులకు ఇది వర్తించనుంది. ఎల్‌నివో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల క్రమంలో ఏపీ ప్రభుత్వం మొత్తం 380 కరువు ప్రభావిత మండలాలను ప్రకటించింది. ఈ మండలాల్లో లోన్లు తీసుకున్న రైతులకు మాత్రమే బ్యాంక్ రుణాలను రీషెడ్యూల్ చేస్తారు. మిగతా మండలాల రైతులకు ఇవి వర్తించదు. కరువు పరిస్థితుల క్రమంలో రైతులకు ప్రయోజనం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి.

విజయవాడలో తాజాగా రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైతుల రుణాలపై చర్చించారు. అనంతరం కరవు మండలాల్లోని రైతుల రుణాలను రీషెడ్యూల్ చేసే నిర్ణయానికి ఆమోదం తెలిపారు. రుణాలు రీషెడ్యూల్ చేయడం వల్ల రుణం చెల్లించడానికి రైతులకు మరింత సమయం లభిస్తుంది. దీని వల్ల రుణం చెల్లించాల్సిందిగా బ్యాంకులు ఒత్తిడి చేసే అవకాశం ఉండదు. అగ్రికల్చర్, పశుసంవర్ధక, మత్స్య పరిశ్రమ, పట్టు పెంపకం, ఆగ్రో/ఆహార శుద్ధి యూనిట్ల రుణాలకు ఇది వర్తింపచేయనున్నారు. ఈ నెల 1న ఏపీ ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించింది. ఈ క్రమంలో బ్యాంకర్ల నుంచి ఈ నిర్ణయం వెలువడింది. పల్నాడుతో పాటు అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు.

ఈ మండలాల్లో రుణాలు చెల్లించేందుకు 60 నెలల గడువు పొడిగించారు. దీంతో రైతులకు రుణాలు చెల్లించేందుకు మరింత గడువు లభించనుంది. కరువు పరిస్థితుల క్రమంలో ప్రభుత్వాలు బ్యాంకులతో మాట్లాడి రైతుల రుణాలు రీషెడ్యూల్ చేయాల్సిందిగా కోరతాయి. ఆర్బీఐ నిబంధనలు కూడా ఇందుకు అనుకూలంగా ఉన్నాయి. దీంతో ఆర్బీఐ రూల్స్ ప్రకారం రైతుల రుణాలను రీషెడ్యూల్ చేయనున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us