Andhra Pradesh: విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం.. ఉపాధ్యాయులకు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుభాకాంక్షలు..

|

Sep 04, 2022 | 10:18 PM

ఆంధ్రప్రదేశ్‌ లో విద్యారంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్..

Andhra Pradesh: విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం.. ఉపాధ్యాయులకు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుభాకాంక్షలు..
Botsa Satyanarayana
Follow us on

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ లో విద్యారంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు ఎంతో కీలక భూమిక వహిస్తారని అటువంటి వారిని గురుపూజోత్సవం రోజు సత్కరించుకోవడం ముదావహమని పేర్కొన్నారు. సీఏం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అనేక సంస్కరణలు అమలు చేస్తున్నారని, వాటి ద్వారా విద్యార్ధులకు మెరుగైన ప్రమాణాలతో విద్య అందేలా ఉపాధ్యాయులందరూ పునరంకితం కావాలన్నారు.

ఉపాధ్యాయులంటే కేవలం తరగతి గదులకే పరిమితం కాదని, తల్లి దండ్రుల తరువాత పిల్లలు ఎక్కువగా గడిపేది టీచర్లతోనే అని, పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసేది వారేనని ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని విద్యా రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలని మంత్రి బొత్స సత్యనారాయణ ఆకాంక్షించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..