Minister Adimulapu Suresh: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్ష‌లు క‌చ్చితంగా నిర్వ‌హిస్తాం.. క్లారిటీ ఇచ్చిన ఏపీ విద్యాశాఖ మంత్రి

ఆంధ్రప్రదేశ్‌లో 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ఖచ్చితంగా నిర్వ‌హిస్తామ‌ని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్ప‌ష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది టెన్త్, ఇంటర్మీడియెట్‌ పరీక్షలు నిర్వహిస్తామని..

Minister Adimulapu Suresh: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్ష‌లు క‌చ్చితంగా నిర్వ‌హిస్తాం.. క్లారిటీ ఇచ్చిన ఏపీ విద్యాశాఖ మంత్రి
Adimulapu Suresh

Updated on: Feb 08, 2022 | 6:14 PM

Minister Adimulapu Suresh: ఆంధ్రప్రదేశ్‌లో 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ఖచ్చితంగా నిర్వ‌హిస్తామ‌ని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్ప‌ష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది టెన్త్, ఇంటర్మీడియెట్‌ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇప్పటికే కరోనా కొత్త నిబంధనల ప్రకారం పాఠశాలలు నడిపిస్తున్నామని వెల్లడించారు. ప్రతి మండలానికి 2 లేదా 3 జూనియర్‌ కళాశాలలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే తరంలో పోటీ ప్రపంచాన్ని తట్టుకునేలా పేద పిల్లల కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి నూతన విద్యావిధానాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. అందులో భాగంగా ఫౌండేషన్ పద్ధతిని ప్రారంభించారని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఒక్క స్కూల్‌ కూడా మూతపడదని.. ఏ ఒక్క టీచర్‌ ఉద్యోగం పోదని హామీ ఇచ్చారు.

నాడు-నేడు కింద మొదటి విడతలో రూ.3700 కోట్ల ఖర్చుతో పాఠశాలలను ఆధునీకరించామని మంత్రి చెప్పారు. నూతన పాఠశాలలు, కళాశాలలు మంజూరు చేస్తున్నామని, అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న జూనియర్‌ కళాశాలలకు అదనంగా మరిన్ని జూనియర్‌ కళాశాలలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఉపాధ్యాయుల నియామకం చేపడతామన్నారు.

ఇవి కూడా చదవండి: UP Election 2022: నేర చరిత్రులకు టికెట్లు.. ఏ పార్టీలో ఎంత మందిపై క్రిమినల్ కేసులో తెలిస్తే షాకవడం ఖాయం..

Ministry of Defence Recruitment 2022: ఇంటర్‌ పాస్‌తో రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగ అవకాశాలు.. ఇలా అప్లై చేయండి..