ఏపీ హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. ఆ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను వెంటనే..

| Edited By:

Mar 15, 2020 | 12:29 PM

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్స్ ప్రక్రియలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషనర్ సీరియస్ అయ్యారు. నామినేషన్ల ప్రక్రియను అడ్డుకోవడం ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నట్లు భావిస్తున్నామని.. అధికారులు ప్రేక్షక పాత్రను పోషించడం దారుణమన్నారు. గుంటూరు, చిత్తూరులో జరిగిన హింసాత్మక ఘటనలు తమ దృష్టికి వచ్చాయని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుడదని ఆశిస్తున్నామన్నారు. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, ఎస్పీలను విధుల నుంచి తప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని.. వారి స్థానాల్లో ఇతర అధికారులను నియమించాలని ఈసీ రమేష్ […]

ఏపీ హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. ఆ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను వెంటనే..
Follow us on

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్స్ ప్రక్రియలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషనర్ సీరియస్ అయ్యారు. నామినేషన్ల ప్రక్రియను అడ్డుకోవడం ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నట్లు భావిస్తున్నామని.. అధికారులు ప్రేక్షక పాత్రను పోషించడం దారుణమన్నారు. గుంటూరు, చిత్తూరులో జరిగిన హింసాత్మక ఘటనలు తమ దృష్టికి వచ్చాయని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుడదని ఆశిస్తున్నామన్నారు.

గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, ఎస్పీలను విధుల నుంచి తప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని.. వారి స్థానాల్లో ఇతర అధికారులను నియమించాలని ఈసీ రమేష్ కుమార్ కోరారు. తిరుపతి, మాచర్ల, పుంగనూరులో ఘర్షణలపై విచారణకు ఆదేశించామని.. అవసరమైతే వాటి వరుకు ప్రత్యేకంగా ఎన్నిక నిర్వహిస్తామన్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది.