AP Corona Cases: ఏపీలో కొత్తగా 1,186 కరోనా కేసులు.. గుబులు రేపుతోన్న మరణాలు

|

Sep 01, 2021 | 4:24 PM

ఏపీలో కరోనా తీవ్రత రోజు రోజుకు మరోసారి పెరుగుతోంది. నిన్నటి కంటే ఈ రోజు పాజిటివ్ కేసుల సంఖ్యతోపాటు మృతుల సంఖ్య కూడా పెరిగింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 56,155 శాంపిల్స్ టెస్ట్ చేయగా...

AP Corona Cases: ఏపీలో కొత్తగా 1,186  కరోనా కేసులు.. గుబులు రేపుతోన్న మరణాలు
Ap Corona
Follow us on

ఏపీలో కరోనా తీవ్రత రోజు రోజుకు మరోసారి పెరుగుతోంది. నిన్నటి కంటే ఈ రోజు పాజిటివ్ కేసుల సంఖ్యతోపాటు మృతుల సంఖ్య కూడా పెరిగింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 56,155 శాంపిల్స్ టెస్ట్ చేయగా 1,186 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,15,302కి చేరింది. కొత్తగా 10 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 13867 కి చేరింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో1,396 మంది వైరస్ కారణంగా కోలుకున్నారు. కొత్తగా కోలుకున్నవారితో కలిపి రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 1986962కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14473 యాక్టివ్ కేసులున్నాయి. నేటివరకు రాష్ట్రంలో 2,66,85,469 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ వల్ల కొత్తగా కృష్ణ జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, తూర్పు గోదావరి, ప్రకాశం, విశాఖపట్నంజిల్లాలో ఒక్కొ క్క రు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. కాగా తూర్పు గోదావరి జిల్లాలో ప్రమాదకరంగా 175 కొత్త కేసులు వెలుగుచూశాయి.

కరోనా సమాచారం మీ చేతుల్లోనే:

● కరోనా సంబంధించిన అధికారిక సమాచారం కోసం వాట్సాప్ చాట్ బాట్ నంబర్ (8297-104-104) కు Hi, Hello, Covid అని మెసేజ్ చేయడి.
● స్మార్ట్ ఫోన్ లేని వారు (8297-104-104) కు ఫోన్ చేసి IVRS ద్వా రా కరోనాకు చెందిన సమాచారం, సహాయం పొందవచ్చు
● 104 టోల్ ఫ్రీ కు ఫోన్ చేసి కరోనా సంబంధించిన వైద్య సమస్యలు తెలుపవచ్చు
వెబ్ సైట్ ద్వా రా డాక్టర్ గారిని వీడియో కాల్ లో సంప్రదించి, కరోనాకు సంబంధించిన వైద్య సహాయం పొందవచ్చు.
● కోవిడ్19 పై సమగ్ర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తుంది COVID-19 AP app. క్రింద లింక్ నుంచి ఆప్ డౌన్లోడ్ చేసుకోండి, రాష్ట్రలో కోవిడ్ సమాచారం తెలుసుకోండి.

ఇవి కూడా చదవండి:  Pub Culture: అక్కడ రూల్స్.. గీల్స్ జాన్తానై.. పబ్బుల్లో నిబంధనలు గాలికి.. చిన్నారులను కూడా అనుమతిస్తున్న వైనం..