ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌లో ఎన్నికల ప్రచారంలో నియమావళి ఉల్లంఘించారన్న కేసు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు వేశారు. 2014లో అనుమతి లేకుండా రోడ్‌షో నిర్వహించారని జగన్‌పై కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకావాలని ఇటీవల జగన్‌కు ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో ఆయన హైకోర్టులో అప్పిల్ చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం జగన్ హాజరుపై ఏప్రిల్ 26 వరకు స్టే విధించింది.
Read Also.. Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో నిప్పులు చెరుగుతోన్న భానుడు.. అక్కడ ఆరెంజ్ అలెర్ట్ జారీ..