CM Jagan: ‘అన్నా బిడ్డకు బాగోలేదు..’ జనం మధ్య నుంచి మహిళ అరుపులు.. బస్సులో వెళ్తున్న జగన్ ఒక్కసారిగా

|

Aug 04, 2022 | 5:53 PM

ఏపీ సీఎం జగన్ ఓ మహిళ కోసం తన కాన్వాయ్ ఆపారు. బిడ్డ ఆరోగ్య పరిస్థితి గురించి ఆమె చెప్పిన మాటలను సీఎం సావధానంగా వెన్నారు. వెంటనే ఆమెకు సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

CM Jagan: అన్నా బిడ్డకు బాగోలేదు.. జనం మధ్య నుంచి మహిళ అరుపులు.. బస్సులో వెళ్తున్న జగన్ ఒక్కసారిగా
Cm Jagan
Follow us on

Andhra Pradesh: ఏపీ సీఎం జగన్  కాకినాడ జిల్లా(kakinada district)లోని తుని(Tuni)లో తన పర్యటనలో మరోసారి తన మంచిమనుసును చాటుకున్నారు. జనాల మధ్య చంటిబిడ్డతో ఉన్న ఓ తల్లి ఆవేదనను ఆయన గుర్తించారు. ఆ తల్లి ఆక్రందనను చూసి తన కాన్వాయ్‌ను ఆపించి దిగారు. ఆ తల్లి వివరాలు అడిగి తెలుసుకుని.. ఆమె కష్టం విని చలించిపోయారు. ఉన్నఫలంగా ఆ చిన్నోడికి వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం మండపం గ్రామానికి చెందిన తనూజకు ఓ కొడుకు ఉన్నాడు. ఆ బిడ్డ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సాయం కోసం ఆమె సీఎం జగన్‌ను కలిసేందుకు ప్రయత్నించింది. కానీ వేల మంది జనంలో ఆమెకు ముందుకు వెళ్లే అవకాశం కుదరలేదు. దీంతో  సీఎం జగన్ కాన్వాయ్ వస్తున్న సమయంలో.. తన బిడ్డను ఎత్తి చూపిస్తూ గట్టిగా ఏడుస్తూ కేకలు వేసింది. ఆమెను గమనించిన సీఎం.. వెంటనే కాన్వాయ్ ఆపారు. తనూజను తన వద్దకు పిలిచి.. సమస్య అడిగి తెలుసుకున్నారు. తన బిడ్డ ఆరోగ్య పరిస్ధితిని వివరించి ఆదుకోవాలని తనూజ కోరడంతో ఆయన వెంటనే స్పందించారు. కాకినాడ జిల్లా కలెక్టర్‌కు సమస్యను పరిష్కరించాలని ఆదేశించి.. అప్పటికప్పుడే ఆమెకు సాయం అందేలా చర్యలు తీసుకున్నారు. దీంతో దటీజ్ సీఎం జగన్ అని కామెంట్స్ పెడుతున్నారు వైసీపీ అభిమానులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..