CM Jagan: ‘జనాలు ఇదేం ఖర్మారా బాబు అనుకుంటున్నారు’.. చంద్రబాబుకు జగన్‌ సాలిడ్‌ కౌంటర్‌..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ఫైర్‌ అయ్యారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జగన్‌ అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లపై...

CM Jagan: జనాలు ఇదేం ఖర్మారా బాబు అనుకుంటున్నారు.. చంద్రబాబుకు జగన్‌ సాలిడ్‌ కౌంటర్‌..
Jagan Mohan Reddy

Updated on: Nov 21, 2022 | 4:00 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ఫైర్‌ అయ్యారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జగన్‌ అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లపై విరుచుకుపడ్డారు. తనదైన శైలిలో సాలిడ్‌ కౌంటర్‌ ఇచ్చారు. చంద్రబాబు తనకు ఇవే చివరి ఎన్నికలు అవుతాయని ప్రజల్ని బెదిరిస్తున్నాడన్న ముఖ్యమంత్రి.. చంద్రబాబుకు చివరికి కుప్పంలో కూడా గెలవలేననే భయం ఆయన మాటల్లోనూ కనిపిస్తోందని విమర్శించారు.

దత్త పుత్రుడి పార్టీని రౌడీ సేనగా మార్చేశారని విమర్శించిన జగన్‌.. గత ఎన్నికల్లోనే ప్రజలు వారికి బైబై చెప్పారని సెటైర్‌ వేశారు. ‘చంద్రబాబు, అతని దత్తపుత్రుడు కలిసి రాజకీయ కుట్రలు చేస్తున్నారు. దత్తపుత్రుడిని, సొంతపుత్రుడు ఇద్దరినీ ప్రజలు ఓడించారు. చంద్రబాబు అధికార భగ్నప్రేమికుడు. ఇవన్నీ చూశాక జనాలు తలలు పట్టుకుని ఇదేం ఖర్మరాబాబూ అనుకుంటున్నారు’ అని విమర్శించారు. చంద్రబాబుని, దత్తపుడ్రుడిని నమ్మొదన్న జగన్‌.. టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీగా మార్చేశారని ఎద్దేవా చేశారు.

ఇక నరసాపురం పర్యటనలో భాగంగా మత్స్యకార దినోత్సవ సభలో పాల్గొన్న జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ.. నరసాపురం రూపురేఖలు మారబోతున్నాయన్నారు. ఇప్పటి వరకు తమిళనాడు, కేరళలోనే ఆక్వా వర్సిటీలు ఉన్నాయని, మూడో వర్సిటీ నరసాపురంలోనే ఏర్పాటు చేస్తామన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో 9 హార్బర్లు రాబోతున్నాయని తెలిపారు. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఆయిల్ డ్రిల్లింగ్ కార్యక్రమాల వలన నష్టపోయిన 20 వేల మంది మత్స్యకారులకు రూ. 108 కోట్లు పరిహారం ఇస్తున్నామని జగన్‌ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..