Chandrababu: గుజరాత్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం..!

|

Sep 15, 2024 | 4:33 PM

కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఈ నెల 16 నుంచి 18 నుంచి 4వ గ్లోబల్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ ఇన్వెస్టర్స్‌ మీట్‌, ఎక్స్‌పో (ఆర్‌ఇ-ఇన్వెస్ట్‌ 2024) జరగనుంది.

Chandrababu: గుజరాత్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం..!
PM Modi - CM Chandrababu
Follow us on

కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఈ నెల 16 నుంచి 18 నుంచి 4వ గ్లోబల్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ ఇన్వెస్టర్స్‌ మీట్‌, ఎక్స్‌పో (ఆర్‌ఇ-ఇన్వెస్ట్‌ 2024) జరగనుంది. నాలువ గ్లోబల్ రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్‌లో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గుజరాత్‌ పర్యటనకు వెళ్తున్నారు. గాంధీనగర్‌ వేదికగా జరిగే ఈ సదస్సులో పునరుత్పాదక ఇంధన రంగంలో ఉన్న అవకాశాలపై మాట్లాడటంతోపాటు ఓ నివేదికను విడుదల చేయనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరవ్వనున్నారు. ఈ సమావేశాలను ప్రారంభించడంతోపాటు ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ సదస్సు తొలి రోజు సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఏపీలో అమలు చేయనున్న సోలార్, సోలార్ – విండ్, హైడ్రో పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి గురించి వివరిస్తారు. దాంతోపాటు ఈ ప్రాజెక్టులకు ఇస్తున్న ప్రోత్సాహకాలు, ప్రాధాన్యత, విధాన పరమైన నిర్ణయాలపై కూడా ప్రసంగిస్తారు.

గ్లోబల్ రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్‌కు రావాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. సదస్సుకు హాజరు కావాలని నిర్ణయించిన చంద్రబాబు రాష్ట్ర ఇంధన శాఖ అధికారులతో సమావేశమయ్యారు. సదస్సులో ప్రసంగంపైన చర్చించారు. ఇక..ఈ సదస్సు సమయంలోనే ప్రధాని మోదీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను వివరించనున్నారు. భారీ వర్షాలు..వరదల కారణంగా జరిగిన నష్టం..సహాయక చర్యల పైన ప్రధానికి నివేదించనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌చౌహాన్‌తో పాటు కేంద్ర అధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించింది. వరదల కారణంగా జరిగిన నష్టానికి కేంద్రం ఆర్దికంగా సహకరించాలని చంద్రబాబు కోరనున్నారు. అదే విధంగా అమరావతికి రూ .15 వేల కోట్ల రుణం..పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ఆమోదించిన డీపీఆర్‌లో అడ్వాన్స్ నిధుల గురించి చర్చించే అవకాశం ఉంది. దీంతో..రాష్ట్రానికి వరద సాయంపైన ప్రధాని ఏం చెబుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..