Chandrababu: తమాషాలేస్తున్నారు.. ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయండి.. సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్‌

|

Jul 09, 2024 | 5:59 PM

ప్రజలకు నిజాలు తెలియాలనే శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం.. శ్వేతపత్రాలను తేలిగ్గా తీసుకోవద్దు.. రాష్ట్ర పరిస్థితిని తెలిపేందుకే వైట్‌పేపర్స్‌ తీసుకొస్తున్నాం.. రాష్ట్ర ఆర్థిక దుస్థితి తవ్వినకొద్దీ బయటకొస్తోంది.. అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏపీలో విద్యుత్‌శాఖ పరిస్థితిపై సీఎం చంద్రబాబు మంగళవారం శ్వేతపత్రం విడుదల చేశారు.

Chandrababu: తమాషాలేస్తున్నారు.. ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయండి.. సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్‌
Chandrababu
Follow us on

ప్రజలకు నిజాలు తెలియాలనే శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం.. శ్వేతపత్రాలను తేలిగ్గా తీసుకోవద్దు.. రాష్ట్ర పరిస్థితిని తెలిపేందుకే వైట్‌పేపర్స్‌ తీసుకొస్తున్నాం.. రాష్ట్ర ఆర్థిక దుస్థితి తవ్వినకొద్దీ బయటకొస్తోంది.. అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏపీలో విద్యుత్‌శాఖ పరిస్థితిపై సీఎం చంద్రబాబు మంగళవారం శ్వేతపత్రం విడుదల చేశారు. శ్వేతపత్రం విడుదల కార్యక్రమంలో చంద్రబాబు అధికారులపై అసహనం వ్యక్తంచేశారు. పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ కోసం సరైన ఏర్పాట్లు చేయలేదని.. అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలంటూ సూచించారు. తమాషాలేస్తున్నారని.. అధికారులకు ఇంకా పాతవాసనలు పోలేదంటూ చంద్రబాబు మండిపడ్డారు. సరిగా పనిచేయడం లేదు.. ఇంకా అందర్నీ సెట్‌ చేయాల్సి ఉందని.. చంద్రబాబు పేర్కొన్నారు.

కాగా.. శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు.. గత ప్రభుత్వం విద్యుత్‌ వ్యవస్థను ధ్వంసం చేసిందంటూ పేర్కొన్నారు. విద్యుత్‌ శాఖలో లక్షా29వేల 503 కోట్ల అప్పులున్నాయన్నారు. ఐదేళ్లలో ఇష్టానుసారం వ్యవహరించారు.. అసమర్థపాలనతో ఎంత నష్టమనే దానికి ఇదే ఉదాహరణ అంటూ పేర్కొన్నారు. ఏ శాఖ చూసినా తీవ్ర పరిస్థితులున్నాయని.. ప్రజలకు వాస్తవాలు తెలిసేందుకే శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దారుణంగా దెబ్బతీశారని.. మెరుగైన పాలనతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.

వీడియో చూడండి..

2014 నుంచి విద్యుత్ ఉత్పత్తిని పెంచామని.. విద్యుత్ సంస్కరణలతో మిగులు విద్యుత్ వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. 2018నాటికి ఏపీ మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఎదిగిందని.. 2019 నాటికి 14,929 మెగావాట్ల ఉత్పత్తి జరిగిందన్నారు. 2019-24లో విద్యుత్ సంస్థలపై.. రూ.1.29 లక్షల కోట్లు అప్పులు తెచ్చారన్నారు. 2019-24 మధ్య విద్యుత్ టారిఫ్ కూడా పెరిగిందన్నారు. ఏపీ ప్రజలపై భారం మోపారని.. అసమర్థపాలనతో ఎంత నష్టమనే దానికి ఇదే ఉదాహరణ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..