CM Jagan: ఎమ్మెల్యేలతో భేటీకానున్న సీఎం జగన్‌.. ఢిల్లీలోనే టైమ్‌ ఫిక్స్‌. కారణం అదేనా.?

|

Mar 30, 2023 | 2:36 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. బుధవారం ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో జగన్ భేటీ అయ్యారు...

CM Jagan: ఎమ్మెల్యేలతో భేటీకానున్న సీఎం జగన్‌.. ఢిల్లీలోనే టైమ్‌ ఫిక్స్‌. కారణం అదేనా.?
Cm Jagan
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. బుధవారం ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో జగన్ భేటీ అయ్యారు. నిర్మలా సీతారామన్‌ను గురువారం ఉదయం కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన రావాల్సిన నిధులు, బకాయిల విడుదలపై ఆర్థిక మంత్రితో చర్చించారు. దాదాపు 45 నిమిషాలపాటు వీరి భేటీ జరిగింది.

ఉపాధి హామీ, పోలవరం నిధుల విడుదల గురించి కూడా నిర్మలా సీతారామన్‌తో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌కు శ్రీనివాసుడి ఫొటో, స్వామి వారి ప్రసాదాన్ని జగన్‌ అందజేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కూడా సీఎం జగన్‌ కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ఆయన ప్రస్తావించారు.

ఎమ్మెల్యేలతో భేటీ కానున్న సీఎం..

ఇదిలా ఉంటే ఏప్రిల్‌ 3వ తేదీన సీఎం జగన్‌ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉండగానే సీఎం జగన్‌ మీటింగ్ కన్ఫామ్‌ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత సమావేశం నిర్వహిస్తుండడం ఆసక్తికగా మారింది. ఏప్రిల్‌3వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు క్యాంప్‌ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, కో ఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించనున్నారు. తాజా రాజకీయ పరిస్థితులు, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అజెండాగా ఈ సమావేశాలు సాగనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలను కేడర్‌ను సన్నద్ధం చేసేలా సీఎం దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..