Amaravati: అమరావతి R5 జోన్‌ రగడలో కొత్త వివాదం.. హద్దురాళ్లు తొలగించిన స్థానికులు..

|

May 09, 2023 | 4:13 PM

హైకోర్టు ఆదేశాల తర్వాత అమరావతిలోని R5 జోన్‌లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే పనులు వేగవంతం చేసింది ప్రభుత్వం. మొత్తం 11వందల 34 ఎకరాలను ఈ జోన్‌ కోసం కేటాయించారు. వీటిల్లోనే పేదలకు ఇళ్లపట్టాలు ఇస్తారు. ఒకవైపు లేఅవుట్‌ పనులు శరవేగంగా జరుగుతుంటే..

Amaravati: అమరావతి R5 జోన్‌ రగడలో కొత్త వివాదం.. హద్దురాళ్లు తొలగించిన స్థానికులు..
Amaravati Lands
Follow us on

హైకోర్టు ఆదేశాల తర్వాత అమరావతిలోని R5 జోన్‌లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే పనులు వేగవంతం చేసింది ప్రభుత్వం. మొత్తం 11వందల 34 ఎకరాలను ఈ జోన్‌ కోసం కేటాయించారు. వీటిల్లోనే పేదలకు ఇళ్లపట్టాలు ఇస్తారు. ఒకవైపు లేఅవుట్‌ పనులు శరవేగంగా జరుగుతుంటే.. ఇంకోవైపు స్థానికుల నుంచి నిరసనలు తప్పడం లేదు.

మంగళగిరి మండలం కురగల్లులో R5 జోన్‌ హద్దురాళ్లను స్థానికులు తొలగించారు. నిన్న కురగల్లుతోపాటు.. నవులూరు, యర్రబాలెం, నిడమర్రు, కృష్ణాయపాలెంలో అధికారులు పర్యటించి.. అక్కడ భూమిని చదును చేశారు. హద్దురాళ్లు పాతారు. త్వరలోనే CRDA పరిధిలో కేటాయించిన ఈ భూముల్లో గుంటూరు, విజయవాడ పరిధిలోని పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నది ప్రభుత్వం ఆలోచన. అయితే కురగల్లులో హద్దురాళ్లు తొలగించడంతో కలకలం రేగుతోంది.

హైకోర్టు ఆదేశాలను స్థానిక రైతులు కొందరు ఇప్పటికే సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ప్రధాన పిటిషన్‌ ఇంకా పెండింగ్‌లో ఉంది. హైకోర్టు కూడా ప్రధాన పిటిషన్‌ తీర్పునకు లోబడే ఇళ్ల పట్టాల పంపిణీ ఉండాలని స్పష్టం చేసింది. ఈ మాటను పట్టుకునే ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు స్థానికులు. విచారణ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగా.. ఇళ్ల పట్టాలు పంపిణీకి తొందరేముందనేది స్థానికుల వాదన. అయితే అమరావతిలో అందరికీ హక్కు ఉందని చెబుతూ… ఇళ్ల పట్టాల పంపిణీకి శరవేగంగా చర్యలు చేపడుతోంది ప్రభుత్వం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..