Andhra Pradesh: విద్యార్థుల తల్లులకు గుడ్ న్యూస్.. అమ్మఒడి నిధుల విడుదలకు డేట్ ఫిక్స్

సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన సుమారు రెండున్నర గంటలపాటు సాగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమ్మఒడి నిధుల విడుదలకు కూడా మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది.

Andhra Pradesh: విద్యార్థుల తల్లులకు గుడ్ న్యూస్.. అమ్మఒడి నిధుల విడుదలకు డేట్ ఫిక్స్
Amma Vodi

Updated on: Jun 24, 2022 | 9:12 PM

CM Jagan: సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. పలు కీలక నిర్ణయాలకు మంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది. ఈనెల 27న అమలు చేయబోతోన్న అమ్మఒడి పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 43 లక్షల 96వేల 402 మంది తల్లుల ఖాతాల్లోకి అమ్మఒడి నిధులు జమ చేయనుంది. 15 వేల కోట్ల పెట్టుబడి పెట్టే ఆదాని గ్రీన్ ఎనర్జి ప్రాజెక్ట్‌కు ఆమోదముద్ర వేసింది. దేవాలయాల కౌలు భూములు పరిరక్షణ చర్యలపై కేబినెట్ చర్చించింది. జగనన్న ఎంఐజీ లే అవుట్ల అభివృద్ధి పాలసీకి కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. మెడికల్‌ కాలేజీలు, ఆస్పత్రుల్లో 3,530 ఉద్యోగాల భర్తీ, సంక్షేమ క్యాలెండర్‌కు మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. ఆక్వాసాగు సబ్సిడీ 10 ఎకరాలు ఉన్నవారికి సైతం వర్తింపు, పాత జిల్లాల జడ్పీ చైర్మన్ల కొనసాగింపునకు ఆమోదం తెలిపింది. సత్యసాయి జిల్లాలో 2వ పట్టణ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.  కేబినెట్ తీసుకున్న మరిన్ని నిర్ణయాలు…..

  • 35 సంస్థలకు భూ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్
  • కొనసీమ జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్పు..కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు ఆమోదం
  • ఈ నెల 27న అమ్మఒడి పథకానికి నిధులు విడుదల
  • అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖకు గ్రూప్‌-1 ఉద్యోగం ఇచ్చేందుకు అవసరమైన చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం
  • వంశధార నిర్వాసితులకు రూ.216 కోట్ల పరిహారం నిధులు విడుదల చేసేందుకు కేబినెట్‌ భేటీలో నిర్ణయం
  • వచ్చే నెలలో అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలు విద్యాకానుక, కాపు నేస్తం, జగనన్న తోడు, వాహనమిత్ర పథకాలకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..