Somu Veerraju : పాస్టర్లకు డబ్బులివ్వడం.. చర్చిలు కట్టించడమే ప్రాధాన్యత అయ్యింది : సోము వీర్రాజు

|

Jul 24, 2021 | 12:34 PM

ఏపీలో దేవాలయాల సందర్శన కార్యక్రమాన్ని ఇవాళ్టి నుంచి ఏపీ బీజేపీ షురూ చేసింది. ఇందులో భాగంగా ఇవాళ బెజవాడ..

Somu Veerraju : పాస్టర్లకు డబ్బులివ్వడం.. చర్చిలు కట్టించడమే ప్రాధాన్యత అయ్యింది : సోము వీర్రాజు
Somu Veerraju
Follow us on

AP BJP – Temple Visits – Somu Veerraju : ఏపీలో దేవాలయాల సందర్శన కార్యక్రమాన్ని ఇవాళ్టి నుంచి ఏపీ బీజేపీ షురూ చేసింది. ఇందులో భాగంగా ఇవాళ బెజవాడ కనకదుర్గమ్మను బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్, విష్ణు వర్ధన్ రెడ్డి, పలువురు బీజేపీ నేతలు దర్శించుకున్నారు.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏ మాత్రం బాగలేదని.. సీఎం జగన్ ఎవరు చెప్పినా వినే పరిస్థితి లేదని ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. అందుకే తమ బాధను అమ్మవారికి చెప్పుకున్నామని సోము వీర్రాజు అన్నారు.  ఈ రోజుకి కూడా రాష్ట్రంలోని ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో ఉందని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు.

“ఉద్యోగులకు సీపీఎస్ రద్దు అన్నారు.. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామన్నారు. ఒక్క హామీ నెరవేర్చలేదు” అని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. “పాస్టర్లకు డబ్బులు ఇవ్వడం.. చర్చిలు కట్టించడం ప్రభుత్వానికి ప్రాధాన్యత అయ్యింది.. అమ్మవారి దేవాలయంలో వెండి సింహాలు మాయం అయ్యాయి.. అంతర్వేది రథం దగ్ధం ఘటన లో ఎవరినీ అరెస్ట్ చేయలేదు.. ఈ ముఖ్యమంత్రికి చర్చిలు ముఖ్యమా” అని సోము ప్రశ్నించారు.

“హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే.. ఈ ముఖ్యమంత్రి చెవిలో పువ్వులు పెట్టుకున్నాడా” అంటూ సోము మండిపడ్డారు. హైందవ ధర్మానికి వారధిగా,  ప్రతీకగా ఉన్న ఆలయాల్లో పరిస్థితులను పరిశీలించేందుకు నేటి నుంచి 27 వరకు ఆలయాల సందర్శన చేస్తూ యాత్ర చేస్తున్నట్లు సోము వీర్రాజు చెప్పారు.

Read also : Nagarjuna University : మొదటి సెమిస్టర్ తెలుగు పేపర్ బదులు మూడో సెమిస్టర్ క్వశ్చన్ పేపర్.. దిక్కులు చూసిన విద్యార్థులు.!