AP Assembly winter session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. శీతాకాల సెషన్ ప్రారంభం నుంచే అధికార విపక్ష పార్టీల మద్య మాటాలతో తూటాలు పేల్చుకుంటున్నారు. ఆది నుంచి ఘర్షణ వాతావరణంలో సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ మూడో రోజు పలు కీలక బిల్లులను సభ ముందుకు తీసుకువచ్చేందుకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ భావిస్తోంది.
ఉభయ సభల్లో ఇవాళ కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. పోలవరం, బీసీ సంక్షేమ కార్పోరేషన్ల ఏర్పాటు, కరోనా కట్టడిపై బుధవారం అసెంబ్లీలో చర్చకు రానున్నాయి. అలాగే కరోనా కట్టడి, ఉద్యోగుల సంక్షేమం, శాంతి భద్రతలపై మండలిలో చర్చించనున్నారు. అటు అసెంబ్లీలో 11 బిల్లులు చర్చకు రానున్నాయి. దిశా, వ్యవసాయ మండలి, ఏపీఎస్డీసీకి చట్టబద్దత, ఎఫ్‌ఆర్‌బిఎం, ఇంధన చట్ట సవరణ తదితర బిల్లులపై అసెంబ్లీలో చర్చించనున్నారు.
అటు శాసనమండలిలోనూ ఐదు బిల్లులపై చర్చించనున్నారు. ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్, ఆక్వా సీడ్, ఫిషరీస్ యూనివర్శిటీ, ఏపీ గేమింగ్ సవరణ తదితర బిల్లులపై శాసన మండలిలో చర్చ జరుగనుంది.