AP Assembly Sessions: సెప్టెంబర్ మూడో వారంలో శాసనసభ సమావేశాలు.. వ్యూహ ప్రతివ్యూహాలతో రెడీ అవుతున్న అధికార, విపక్షాలు..

|

Aug 30, 2023 | 8:59 AM

AP Assembly Sessions: ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు.. మరో వైపు అసెంబ్లీ సమావేశాలు.. అధికార, విపక్ష పార్టీలు మాటల యుద్ధానికి రెడీ అవుతున్నాయి. శాసనసభ సమావేశాలు వచ్చే నెల మూడో వారంలో నిర్వహించే అవకాశం ుంది. వినాయకచవితి పండుగకి అటుఇటుగా సమావేశాలను నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. సెప్టెంబర్ రెండో వారంలో ఈ సమావేశాలను జరపాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు వెళ్తుండటంతో అప్పుడు సాధ్యంకాదని భావిస్తున్నారు. సీఎం విదేశాల నుంచి తిరిగివచ్చాక మంత్రివర్గ సమావేశం నిర్వహించి అందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

AP Assembly Sessions: సెప్టెంబర్ మూడో వారంలో శాసనసభ సమావేశాలు.. వ్యూహ ప్రతివ్యూహాలతో రెడీ అవుతున్న అధికార, విపక్షాలు..
AP Assembly
Follow us on

ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు.. మరో వైపు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. అధికార, విపక్ష పార్టీలు మాటల యుద్ధానికి రెడీ అవుతున్నాయి. శాసనసభ సమావేశాలు వచ్చే నెల మూడో వారంలో నిర్వహించే అవకాశం ఉంది. వచ్చే నెల 18 లేదా 20వ తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ అసెంబ్లీ సమావేశాలను వారం రోజుల పాటు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. అది కూడా వినాయకచవితి పండుగకి అటుఇటుగా సమావేశాలను నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. సెప్టెంబర్ రెండో వారంలో ఈ సమావేశాలను జరపాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు వెళ్తుండటంతో అప్పుడు సాధ్యంకాదని భావిస్తున్నారు. సీఎం విదేశాల నుంచి తిరిగివచ్చాక మంత్రివర్గ సమావేశం నిర్వహించి అందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

వారం రోజుల పాటు నిర్వహించాలని అధికార పార్టీ అనుకుంటున్నా.. ఈ సమావేశాలను వారం నుంచి 10 రోజులకు పొడిగించాలా? లేదా తగ్గించడమా? అనేది ఏపీ ప్రభుత్వం బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయించనుంది. ఈ భేటీకి మందే- ఏపీ మంత్రివర్గం సమావేశమౌతుంది. ఇందులో పలు నిర్ణయాలు తీసుకుంటుంది. 15వ తేదీన సచివాలయంలో ఈ భేటీ నిర్వహించన తర్వాతే నిర్ణయాలు జరగనుంది. సీఎం జగన్ దీనికి అధ్యక్షత వహిస్తారు. వర్షాకాల సమావేశాలను ఎప్పుడు చేపట్టాలనేది ఈ బీఏసీ మీటింగ్‌లో ఖారారవుతుంది.

దీనితోపాటు- సభలో ప్రవేశపెట్టడానికి ఉద్దేశించిన బిల్లులపై ఇందులో చర్చిస్తారు. ఈసమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు సంగతిలో ఇక ఆలస్యం చేయకూడదని.. ఈ సమావేశాల్లో బిల్లును తీసుకురావాలని జగన్ సర్కర్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.ఇదివరకు మూడు రాజధానుల బిల్లులను ప్రభుత్వం వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.

మరింత మెరుగైన బిల్లుతో వస్తామంటూ గత అసెంబ్లీ సమావేశాల ముగింపులో చెప్పడం.. ఈ సమావేశాలు ఎలా జరగనున్నాయో ఊహించుకోవచ్చు. రాబోయే నెలలో కానీ ఆ తర్వాత వచ్చే నెలలో సీఎం క్యాంప్ కార్యాలయం.. విశాఖకు తరలి వెళ్లొచ్చనే ప్రచారం ఊపందుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ అసెంబ్లీలో దీనికి సంబంధించిన అంశాలు చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది.

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటనేదే ఇక్కడ ఆసక్తికరంగా మారింది. ఇదివరకు ఆ పార్టీ శాసనసభ బడ్జెట్ సమావేశాలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలను బహిష్కించినట్లుగానే ఈసారి కూడా బైకాట్ చేయడం ఖాయం అని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నిలకల హీట్ కొనసాగుతున్న ఈ సమయంలో సమావేశాలు జరగనుండటం.. రాజధాని అంశంపై టీడీపీ పట్టుపట్టే అవకాశం ఉంది.