Jangareddygudem: వరుస మరణాలపై హీటెక్కుతున్న ఏపీ రాజకీయాలు.. టీడీపీ ఆందోళనతో అసెంబ్లీ వాయిదా

|

Mar 14, 2022 | 11:45 AM

Jangareddygudem mystery deaths: ఏపీ రాజకీయం పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డి గూడెంలో సంభవించిన వరుస మరణాల చుట్టూ తిరుగుతోంది. వరుస మరణాలపై అసెంబ్లీలో చర్చకు పట్టుపట్టింది టీడీపీ.

Jangareddygudem: వరుస మరణాలపై హీటెక్కుతున్న ఏపీ రాజకీయాలు.. టీడీపీ ఆందోళనతో అసెంబ్లీ వాయిదా
Tdp Vs Ycp
Follow us on

Jangareddygudem mystery deaths: ఏపీ రాజకీయం పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డి గూడెంలో సంభవించిన వరుస మరణాల చుట్టూ తిరుగుతోంది. వరుస మరణాలపై అసెంబ్లీలో చర్చకు పట్టుపట్టింది టీడీపీ. సభ మొదలైన వెంటనే టీడీపీ సభ్యులు సభను అడ్డుకున్నారు. వెల్‌లోకి వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాలు జరిగిన తర్వాత.. అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ చెప్పినా.. తమ ఆందోళన కొనసాగించారు. టీడీపీ సభ్యులు తమ సీట్లలోకి వెళ్లకపోవడంతో సభ వాయిదా పడింది. అయితే.. జంగారెడ్డి గూడెం మరణాలను అడ్డుపెట్టుకుని టీడీపీ శవరాజకీయాలు చేస్తోందని వైసీపీ భావిస్తోంది. అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టిన టీడీపీకి.. దీటుగానే సమాధానం చెప్పాలని కూడా జగన్‌ కాసేపటి క్రితం మంత్రులకు సూచించారు. జంగారెడ్డి గూడెంలో జరిగిన మరణాలు కల్తీసారా కారణంగా జరిగినవా లేదా అన్న విషయంపై క్లారిటీ కోసం కాసేపటి క్రితం సీఎం జగన్‌.. వైద్యఆరోగ్య శాఖమంత్రి ఆళ్లనాని, జిల్లాకు చెందిన మంత్రి పేర్నినాని, ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణస్వామితో భేటీ అయ్యారు. జంగారెడ్డి గూడెం విషయంలో టీడీపీ చేస్తున్న లేనిపోని ప్రచారాలను ఆసెంబ్లీ వేదికగానే కట్టడి చెద్దామని జగన్‌ మంత్రులకు దిశానిర్దేశం చేశారు.

అంతకుముందు.. అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నడుచుకుంటూ ర్యాలీగా వెళ్లారు. మద్యపాన నిషేధం ఏమైందంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్రంలో నాసిరకం మద్యం బ్రాండ్లు అమ్ముతున్నారంటూ ఆరోపించారు. కల్తీసారా మరణాల్ని సహజ మరణాలుగా చిత్రీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యేలు. కొద్దిరోజులుగా జంగారెడ్డి గూడెంలో చనిపోయింది పాతిక మంది అని.. రాష్ట్రవ్యాప్తంగా కల్తీ సారాకు వందల మంది మృతి చెందారని ఆరోపించారు.

Also Read:

PM Narendra Modi: ప్రధాని మోదీకి అద్భుత శక్తులున్నాయ్.. కాంగ్రెస్ సీనియర్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు..

Viral Photo: ఈ ఫొటోలో ముఖ్యమంత్రి ఉన్నారు.. యూత్ ఐకానిక్ ఈయనే.. గుర్తుపడితే మీరు జీనియస్..