
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రతి మూల నుంచి రీసౌండ్స్ వినిపిస్తున్నాయి. రాత్రిళ్లు సైతం ఆ సౌండ్స్ వినపడుతుంటే భూములిచ్చిన 29వేల మంది రైతులకు కంటినిండా నిద్రపడుతోంది. క్యాపిటల్ సిటీ కన్‌స్ట్రక్షన్ ఆ లెవెల్‌లో జరుగుతోంది. ఏడాదిన్నరగా రాజధాని పనులు ఊపందుకున్నప్పటికీ.. గత రెండు రోజులుగా ‘అమరావతి’ పేరు ఇంకాస్త గట్టిగా వినిపిస్తోంది. గురువారం (నవంబర్ 27) నాడు వెంకటపాలెంలోని వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. ఆ వెంటనే.. అమరావతి రైతులతో సమావేశం జరిగింది. అక్కడే, ఆ మీటింగ్‌లోనే ‘ఫ్యూచర్ ప్లాన్’ కూడా బయటపెట్టారు సీఎం చంద్రబాబు. దాని గురించి డిటైల్డ్‌గా చెప్పుకుందాం. రైతులతో మీటింగ్ అయిన తెల్లారే అమరావతిలో ‘ఆర్థిక నగరి’ పురుడుపోసుకుంది. ఒకేసారి 15 బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు శంకుస్థాపన జరిగింది. ఓవరాల్‌గా అమరావతి నిర్మాణంలో మరో ఫేజ్ మొదలైందా అనిపించేలా ఓ వైబ్ కనిపిస్తోంది. ఏడాదిన్నరకే రాజధాని ఓ రూపుకు వచ్చేసిందనే అభిప్రాయం అటు రైతుల నుంచి వినిపిస్తుంది. ఇంతటితోనే ప్రభుత్వం సంతృప్తి పడట్లేదు. జరగాల్సింది ఇంకా చాలా ఉందంటోంది. అందుకే, టార్గెట్ పెట్టుకుని మరీ అమరావతిలో నిర్మాణ పనులను పరుగులు పెట్టిస్తోంది ప్రభుత్వం. మరోవైపు.. వరల్డ్ ఫేమస్ ఇంటర్నేషనల్ కంపెనీలు అమరావతిలో అడుగుపెడుతున్నాయ్. ఎక్కడికక్కడ భూకేటాయింపులు, వాటి నిర్మాణాలు జరుగుతున్నాయ్. మొత్తంగా సరికొత్త ‘రైజింగ్ అమరావతి’ కనిపిస్తోంది రాజధానిలో. ఇప్పటిదాకా అమరావతిలో జరిగిందేంటి? నడుస్తున్నవేంటి? ఫ్యూచర్‌లో రాబోయేవేంటి? రాజధానికి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్.. అమరావతిని ‘మహానగరం’గా మార్చడానికి...