Andhra: యూట్యూబ్‌‌లో చూసి ఎంతకు తెగించావ్‌రా.. వాడకం గురించి తెలిస్తే మైండ్ బ్లాంకే..

బైక్ దొంగతనాలు చేయడం సర్వసాధారణమే.. అయితే విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడిన ఒక యువకుడు యూట్యూబ్‌లో దొంగతనం ఎలా చేయాలి..? అనే దానిని పరిశీలించి, నేర్చుకున్నాడు.. యూట్యూబ్‌లో చేసినట్లుగా ఖరీదైన బైక్లను దొంగలించి తక్కువ రేట్లకు వాటిని అమ్మేసి జల్సాలకు అలవాటు పడ్డాడు. చివరకు పోలీసులకు పట్టుబడి మొత్తం కక్కాడు..

Andhra: యూట్యూబ్‌‌లో చూసి ఎంతకు తెగించావ్‌రా.. వాడకం గురించి తెలిస్తే మైండ్ బ్లాంకే..
Youtube

Edited By:

Updated on: Mar 03, 2026 | 3:18 PM

బైక్ దొంగతనాలు చేయడం సర్వసాధారణమే.. అయితే విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడిన ఒక యువకుడు యూట్యూబ్‌లో దొంగతనం ఎలా చేయాలి..? అనే దానిని పరిశీలించి, నేర్చుకున్నాడు.. యూట్యూబ్‌లో చేసినట్లుగా ఖరీదైన బైక్లను దొంగలించి తక్కువ రేట్లకు వాటిని అమ్మేసి జల్సాలకు అలవాటు పడ్డాడు. చివరకు పోలీసులకు పట్టుబడి మొత్తం కక్కాడు.. ఈ షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లా రాయచోటి టౌన్ ఇందిరమ్మ కాలనీకి చెందిన షేక్ ఆరిఫ్ అనే వ్యక్తి.. 2024 నుంచి విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడ్డాడు.. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పగలు రెక్కీ నిర్వహించడం రాత్రివేళలో తాళాలు వేసి ఉన్న ఖరీదైన బైకులకు మాయం చేయటం వృత్తిగా ఎంచుకున్నాడు. నిందితుడు అన్నమయ్య జిల్లాలోనే కాకుండా చిత్తూరు, తిరుపతి, కడప జిల్లాలోనూ తన టాలెంట్ ను చూపించాడంట.. అయితే సోమవారం పీలేరులోని పొంతల చెరువు క్రాస్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఆరిఫ్ అనుమానాస్పదంగా కనిపించాడు.

దీంతో పోలీసులు ఆరీఫ్ ను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్ లో విచారించారు. ఈ క్రమంలో మొత్తం సమాచారాన్ని ఆరిఫ్ పోలీసులకు తెలిపాడు.. అతను బైక్ లు దొంగతనం చేసి.. ఎవరెవరికి అమ్మింది కూడా చెప్పడంతో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. అందులో అన్ని రాయల్ ఎన్‌ఫీల్డ్, పల్సర్ బైకులు మాత్రమే ఉన్నాయి.

Rayachoty Police

కాస్ట్లీ బైక్లను ఎంచుకోవడం.. వాటిని ఎలా దొంగతనం చేయాలి.. అని యూట్యూబ్‌లో తెలుసుకొని.. ఆ మార్గంలో వాటిని దొంగలించడం వృత్తిగా పెట్టుకున్న ఆరీఫ్ వద్ద నుంచి మొత్తం 40 లక్షల రూపాయల విలువచేసే 24 బైకులను రికవరీ చేశారు. ఇంకా రికవరీ చేయాల్సిన వాహనాలు ఉన్నట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us