Andhra News: అన్నదాత సుఖీభవ డబ్బులు అకౌంట్లోకి ఎప్పుడంటే..? బిగ్ అప్డేట్ వచ్చేసింది.. ఆలోపే జమ..!

అన్నదాత సుఖీభవ పథకాల కింద రైతులకు రెండో విడత నిధులు త్వరలో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. దసరా పండుగ కానుకగా ఈ ఆర్థిక సహాయం వ్యవసాయ పెట్టుబడులకు ఉపయోగపడనుంది. జూన్ 20న ఈ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత నిధులు జమ చేశారు.

Andhra News: అన్నదాత సుఖీభవ డబ్బులు అకౌంట్లోకి ఎప్పుడంటే..? బిగ్ అప్డేట్ వచ్చేసింది.. ఆలోపే జమ..!
Annadata Sukhibhava

Updated on: Oct 09, 2026 | 8:34 AM

ఆంధ్రప్రదేశ్ రైతులకు త్వరలో కూటమి సర్కార్ శుభవార్త అందించనుంది. అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ ఏడాదికి సంబంధించిన రెండో విడత ఆర్థిక సహాయాన్ని విడుదల చేసేందుకు సిద్దమైంది. దసరా కానుకగా త్వరలో వీటిని రీలీజ్ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిధులు అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అవుతాయి. పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు జమ చేయనుండగా.. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.4 వేలు అందించనుంది. దీంతో ఏపీ రైతుల బ్యాంక్ అకౌంట్లలో మొత్తం రూ.6 వేలు ఒకేసారి జమ కానున్నాయి. గత 23వ విడత పీఎం కిసాన్ నిధులు రాని రైతులు ఎవరైనా ఉంటే.. వారికి ఆ నిధులు కూడా కలిపి మొత్తం ఒకేసారి అందుతాయి.  దీంతో రైతులు ఈ నగదు కోసం ఎదురుచూస్తున్నారు.

ఒక్కొ రైతు ఖాతాలో రూ.6 వేలు

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ప్రతి ఏటా ఒక్కో రైతు కుటుంబానికి రూ.6 వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. దీనికి అదనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఏటా రూ.14 వేలు అందిస్తోంది. దీని ఫలితంగా.. రెండు పథకాల ద్వారా రాష్ట్రంలోని అర్హులైన ప్రతి రైతుకు సంవత్సరానికి మొత్తం రూ.20 వేల నగదు లబ్ధి చేకూరుతుంది. ఈ మొత్తం నగదును ప్రభుత్వం ఒకేసారి కాకుండా మూడు విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే తొలి విడత నిధులను విజయవంతంగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. జూన్ 20న సీఎం చంద్రబాబు మొదటి విడత సాయాన్ని విడుదల చేశారు. తొలి విడతలో భాగంగా అర్హులైన ఒక్కో రైతు కుటుంబానికి రూ.7 వేల చొప్పున అందాయి. ఇప్పుడు రెండో విడత నిధులను అక్టోబర్‌లో దసరా కానుకగా విడుదల చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దసరా పండుగ సమయంలో రైతులకు రూ.6 వేల పెట్టుబడి సాయం అందడం వల్ల వ్యవసాయ పనులకు, కుటుంబ అవసరాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఇవి కూడా చదవండి

డబ్బులు అందాలంటే ఏయే పనులు చేయాలి..?

పథకం నిబంధనల ప్రకారం.. ఈ నిధులు పొందడానికి రైతులు కొన్ని అర్హత ప్రమాణాలను పాటించాలి. అందులో ఒకటి ఈకేవైసీ. రెండోవది ఆధార్ నంబర్‌ను బ్యాంకు ఖాతాకు లింక్ చేయడం. మూడో విషయానికొస్తే.. భూమి వివరాల ధృవీకరణ (ల్యాండ్ వెరిఫికేషన్) పూర్తి చేయడం. భూమి ఎక్కడ ఉంది, సర్వే నంబర్ ఎంత, జిల్లా ఏంటి వంటి వివరాలన్నీ పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో పొందుపరచాలి. ఈ మూడు నిబంధనలు పాటించిన వారికి మాత్రమే పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు అందుతాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us