Andhra Pradesh: కొనసీమను హడలెత్తిస్తున్న వింత వ్యాధి.. మూగజీవాలు మృత్యువాత..

|

Feb 14, 2023 | 10:47 PM

వైరస్ తో మూగజీవాలు విలవిలలాడుతున్నాయి. గుర్తుతెలియని వ్యాధితో చనిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Andhra Pradesh: కొనసీమను హడలెత్తిస్తున్న వింత వ్యాధి.. మూగజీవాలు మృత్యువాత..
Virus
Follow us on

వైరస్ తో మూగజీవాలు విలవిలలాడుతున్నాయి. గుర్తుతెలియని వ్యాధితో చనిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు దీవిలో మూగజీవాలు మృత్యు ఘోష కంటనీరు పెట్టిస్తుంది. గత కొద్ది రోజులుగా కోనసీమలో అభం, శుభం తెలియని మూగప్రాణాలు గుర్తుతెలియని వ్యాధితో విలవిలలాడుతూ ప్రాణాలు వదులుతున్నాయి.

పందులు స్వైన్ ఫ్లూతో చనిపోతున్నాయి. లంపి వైరస్ సోకి గోవులు మృతి చెందుతున్నాయి. పందులు, ఆవులే ఆధారంగా బ్రతుకుతున్న రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కుక్కలు సైతం పార్వా వైరస్ సోకి వెలవిలలాడుతూ మృతి చెందటం జంతు ప్రేమికులను కలచివేస్తుంది.

చినిపోయన పందులను నదులు, కాలువతో పడేస్తున్నా అధికారులు అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొందరు. కాలువల్లో పడేసిన పందులను చేపలు తినడం తింటున్నాయి. అదే చేపలు తాము తింటే స్వైన్ ఫ్లూ వైరస్ సోకుతుందేమోనన్న భయంతో మనుషులు చేపలు తినడం మానివేశారని చెప్తున్నారు కొందరు. గోవులకు లంపి వైరస్ వ్యాక్సిన్స్ వేయించిన నయం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.

సచివాలయంలో ఉన్న వెటర్నరీ డాక్టర్ స్పందింయడం లేదని చెప్తున్నారు. ప్రైవేట్ డాక్టర్లను సంప్రదించి.. ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టినా వైరస్ నయం కావడం లేదని చెప్తున్నారు రైతులు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి పశువులను కాపాడాలని కాపాడాలని కోరుకుంటున్నారు పశువుల రైతులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..