Anil Kumar: టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు.. ఎన్నికలకు వెళ్దాం.. అచ్చెన్నాయుడుకు మంత్రి అనిల్‌ సవాల్‌

|

Sep 19, 2021 | 1:13 PM

Anil Kumar on kinjarapu atchannaidu: టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు.. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్దామంటూ ఏపీ మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్.. టీడీపీ నేత

Anil Kumar: టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు.. ఎన్నికలకు వెళ్దాం.. అచ్చెన్నాయుడుకు మంత్రి అనిల్‌ సవాల్‌
Anil Kumar
Follow us on

Anil Kumar on kinjarapu atchannaidu: టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు.. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్దామంటూ ఏపీ మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్.. టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు సవాల్‌ విసిరారు. పరిషత్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం కనిపిస్తుందని.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల తీర్పు తమ వైపే ఉందంటూ ఆయన పేర్కొన్నారు. పరిషత్ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికలకు మించిన పలితాలు వస్తున్నాయంటూ ఆయన అభిప్రాయపడ్డారు. 13 జిల్లాల జెడ్పీ పీఠాల్ని వైసీపీ కైవసం చేసుకోబోతుందంటూ మంత్రి అనిల్ పేర్కొన్నారు. తాము పోటీ చెయ్యలేదు కనుక వైసీపీకి మెజార్టీ వస్తుందనే టీడీపీ నేతలకు సిగ్గుందా.. అంటూ ప్రశ్నించారు. టీడీపీకి నామినేషన్ వేసే దిక్కు కూడా లేక ఎన్నికల ముందు చేతులెత్తేశారని ఆరోపించారు. దమ్ముంటే మీకున్న 19 ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యండి ఎన్నికలకు వెళదాం అంటూ అనిల్ అచ్చెన్నాయుడిపై ఫైర్ అయ్యారు. ధైర్యం ఉంటే తన సవాల్‌ను స్వీకరించాలని.. టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని అనిల్‌.. అచ్చెన్నాయుడికి సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ గుర్తుతో అభ్యర్థులు పోటీలో ఉన్నారని.. కానీ లేరంటూ మాట్లాడుతున్నారని అనిల్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండేళ్ల సీఎం జగన్ సంక్షేమ పాలనకు ఈ ఫలితాలు వస్తున్నాయంటూ అనిల్‌ స్పష్టంచేశారు. ఏ ఎన్నికలు వచ్చినా రాష్ట్ర ప్రజలు సీఎం జగన్‌ను గుండెల్లో పెట్టుకుంటున్నారని తెలిపారు. అయ్యన్నపాత్రుడు నోరు అదుపులో పెట్టుకోకపోతే బుద్ది చెప్పడం ఖాయమంటూ అనిల్‌ కుమార్‌ పేర్కొన్నారు. సీఎం జగన్ నిజంగానే కన్నెర్ర చేస్తే మీరు బయట తిరగగలరా.. అంటూ అనిల్‌ తెలిపారు.

అయితే.. అంతకుముందు టీడీపీ మాజీమంత్రి, శాసనసభ పక్ష ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బోగస్ పరిషత్ ఎన్నికల ఫలితాలు జరుగుతున్నాయని, టీడీపీ ఈ ఎన్నికలను బహిష్కరించిందని అన్నారు. ప్రభుత్వం రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ర్టంలో అడుగడుగునా చట్టాల ఉల్లంఘన, రాజ్యాంగ దిక్కరణ జరుగుతోందన్నారు. పంచాయితీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందో దేశం మొత్తం చూసిందని తెలిపారు.

Also Read:

Atchannaidu: ఇవి బోగస్‌ పరిషత్‌ ఎన్నికల ఫలితాలు.. వైసీపీపై మండిపడ్డ అచ్చెన్నాయుడు

AP MPTC ZPTC Election Results: ఏకపక్షంగా పరిషత్ పోరు.. అన్ని జిల్లాల్లోనూ వైసీపీ జోరు