
‘ఆంధ్రా లాస్ వెగాస్’.. నిన్న మొన్నటిదాకా భీమవరానికి మాత్రమే ఈ బ్రాండ్ నేమ్ ఉండేది. ఇప్పుడు బరి ఉన్న ప్రతి ఏరియా ఓ లాస్ వెగాసే. కోడిపందేలు ఆడడానికి, వాటిని చూడడానికి, పనిలో పనిగా గుండాట, కోతాట ఆడడానికి వచ్చేవాళ్లతో ఆ లాస్ వెగాస్‌నే మించి పోతున్నాయి కొన్ని జిల్లాలు. ఇప్పటిదాకా చూసిన కోడిపందేల బరులు వేరు.. ఈసారి, ఇకమీదట చూడబోయేవి అనేలా ఉంటున్నాయి. గతాన్ని మించి ఏర్పాట్లున్నాయి. స్టార్ హోటల్ రేంజ్ ఫెసిలిటీస్ కాస్తా.. ఫైవ్ స్టార్ రేంజ్‌కి చేరాయి. అసలు ఏపీలో కోడిపందేలంటే ఒక లెవెల్.. అంతే. కోడిపందేలు అంటే గోదావరి జిల్లాలే గుర్తుకొస్తాయి. అక్కడ ఏ రేంజ్‌లో కోడిపందేలు జరుగుతాయి, ఎన్ని వందల కోట్లు చేతులు మారతాయో చెప్పడం కష్టం. కాకపోతే, గతేడాది లెక్కలతో కొంత అంచనా వేయొచ్చు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 400 కోట్ల రూపాయలు చేతులు మారాయన్నది ఓ అంచనా. కృష్ణా జిల్లాలోనే 400 కోట్లు చేతులు మారితే.. ఇక ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఇంకెంత జరిగి ఉండొచ్చు..! ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే లాస్ట్ సీజన్‌లో ఏడెనిమిది వందల కోట్లు చేతులు మారినట్టు ఓ రఫ్ ఎస్టిమేషన్. ఆమాటకొస్తే.. భీమవరంలోనే 150 కోట్ల రూపాయల బెట్టింగ్ నడిచిందని టాక్. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కూడా ఉందిగా. ఈ మొత్తం చూసుకుంటే.. ఓవరాల్‌గా రాష్ట్రం మొత్తం కలిపి ఎంత లేదన్నా 2వేల కోట్ల రూపాయలు గతేడాదే...