పర్యావరణంలో మార్పుల కారణంగా రాబోయే రోజుల్లో మానవాళికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఇప్పటికీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూమిపై కాలుష్యం విపరీతంగా పెరిగిపోయి స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోతుందని హెచ్చరిస్తున్నారు. రాబోయే ప్రమాదాల నుంచి మానవజాతిని రక్షించుకోవడానికి ముందున్న ఒకే ఒక్క మార్గం పర్యావరణాన్ని కలుషితం కాకుండా కాపాడుకోవడమే. అడవులు అంతరించి పోవడంతో భూమి ఉష్ణోగ్రతలు కూడా రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో కొందరు మొక్కలు నాటి భూమిపై పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించాలని ఎన్నో వినూత్న కార్యక్రమాలు సైతం చేపట్టారు. ఈ క్రమంలోనే పర్యావరణ హితం కోసం ఓ యువకుడు చేసిన సాహస యాత్రను పలువురు అభినందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఆ యువకుడు చేసిన సాహసానికి శెభాష్ అంటూ మెచ్చుకున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంకు చెందిన ఏసు అనే యువకుడు పర్యావరణాన్ని కాపాడండి అంటూ సైకిల్ యాత్ర ప్రారంభించాడు. భీమవరం నుండి నుండి లద్దాఖ్ కు 3500 కిలోమీటర్ల దూరం ఒక్కడే సైకిల్ పై యాత్ర సాగించాడు. స్వచ్చత, పర్యావరణ, పరిరక్షణే ధ్యేయంగా ఏసు చేపట్టిన సైకిల్ యాత్ర ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు కొనసాగాడు. భీమవరం నుండి సెప్టెంబర్ 18వ తేదీన సైకిల్ యాత్ర ప్రారంభించిన ఏసు విజయవంతంగా 3500 కిలో మీటర్ల సైకిల్ పై ప్రయాణించి లద్దాఖ్ చేరుకున్నాడు. లద్దాఖ్ చేరుకున్న తర్వాత తన సైకిల్ యాత్ర విజయవంతం అయిందని అక్కడ ఫోటోలు దిగి వాటిని తన ఎక్స్‌లో పోస్ట్ చేసాడు. యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసిన భీమవరం కుర్రోడిని మంత్రి నారా లోకేష్ అభినందించారు. ఇండియా వచ్చాక ఏసును కలుస్తానని, సవాలుతో కూడిన ప్రయాణం విజయవంతంగా ముగిసినందుకు అభినందనలు అని తన ఎక్స్‌లో ఖాతాలో మంత్రి లోకేష్ పోస్ట్ చేశారు.
I look forward to meeting Yesu when I return to India. I extend my warmest wishes to him for the successful culmination of his challenging journey. May he continue to persevere and reach his goals. https://t.co/ykzKwgFCa2
— Lokesh Nara (@naralokesh) October 29, 2024