
నైరుతి బంగాళాఖాతంపై తూర్పు దిశగా ఉపరితల ద్రోణి, సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య మరియు తూర్పు గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో 3 రోజులపాటు వాతావరణ సూచనలు తెలుసుకుందాం..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
————————————-
గురువారం, శుక్రవారం :- పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉన్నది.
శనివారం :- పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-
——————————
గురువారం, శుక్రవారం :- పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగ మంచు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉన్నది.
శనివారం :- తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
రాయలసీమ :-
————–
గురువారం, శుక్రవారం :- పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగ మంచు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉన్నది.
శనివారం :- తేలికపాటినుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
కాగా ఈశాన్య రుతుపవనాల సీజన్ ముగిసింది. ఈ సారి అదనంగా నెల రోజులు రుతుపవనాలు కొనసాగాయని ఐఎండీ ప్రకటించింది. గత ఏడాది అక్టోబరు 15న దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ సారి రాయలసీమలో సాధారణం (236.4 మి.మీ) కంటే 46 శాతం ఎక్కువ వర్షపాతం పడినట్లు లెక్కలు చెబుతున్నాయి. .
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి