AP Weather: ఏపీలో ఇంకా వానలు ఉన్నాయా..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

ఏపీలో వర్షాలు దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే.. లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగాయి. పలు చోట్ల కాలవలు, తూములకు గండ్లు పడ్డాయి. మరి ఇకనైనా వరుణుడు శాంతిస్తాడా..? ఏపి లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకుందాం పదండి....

AP Weather: ఏపీలో ఇంకా వానలు ఉన్నాయా..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
Andhra Weather

Updated on: Jul 23, 2024 | 1:34 PM

తూర్పు మధ్యప్రదేశ్ & దానిని ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించిన అల్పపీడన ప్రాంతం ఇపుడు బలహీన పడినది. ఉపరితల ఆవర్తనము ఇప్పుడు జార్ఖండ్ మరియు పరిసర ప్రాంతాలపై ఉంది. ఎత్తుతో దక్షిణం వైపు వంగి ఉంటుంది. షీర్ జోన్ దాదాపుగా 22° ఉత్తర అక్షాంశము వెంబడి సగటు సముద్ర మట్టం నుండి 3.1 & 7.6 కి.మీల మధ్య ఎత్తుతో దక్షిణం వైపు వంగి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, యానాం లలో దిగువ ట్రోపోస్పిరిక్ స్తాయిల లో పశ్చిమ దిశ గాలులు వీస్తాయి. ఈ క్రమంలో  రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఇప్పుడు తెులసుకుందాం..

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

————————————————

మంగళవారం, బుధవారం, గురువారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది.

 

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ;-

———————————–

మంగళవారం, బుధవారం, గురువారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది.

రాయలసీమ :-

—————-

మంగళవారం, బుధవారం, గురువారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..   

Loading...
Unable to load recommendations.
Follow Us