నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు & కొమోరిన్ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతం మరియు తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి మరింత ముందుకు సాగాయి. నైరుతి రుతుపవనాలు తదుపరి 48 గంటల్లో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు & కొమోరిన్ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతం లోని మరికొన్ని ప్రాంతాలలోకి మరియు ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఉపరితల ఆవర్తనం ,దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ & పరిసరాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉన్నది. కోస్తా ఆంధ్ర ప్రదేశ్ నుండి తమిళనాడు మీదుగా, మన్నార్ గల్ఫ్ వరకు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉన్న ద్రోణి బలహీన పడినది .
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
గురువారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. గరిష్ట ఉష్ణో గ్రతలు క్రమముగా 2 నుంచి 4 డిగ్రీల సెంటి గ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉంది.శ
శుక్రవారం, శనివారం: వాతావరణం పొడి గా ఉండే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణో గ్రతలు క్రమముగా 2 నుంచి 4 డిగ్రీల సెంటి గ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
గురువారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. గరిష్ట ఉష్ణో గ్రతలు క్రమముగా 2 నుంచి 4 డిగ్రీల సెంటి గ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉంది .
శుక్రవారం, శనివారం: వాతావరణం పొడి గా ఉండే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2 నుంచి 4 డిగ్రీల సెంటి గ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉంది.
రాయలసీమ :-
గురువారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. గరిష్ట ఉష్ణో గ్రతలు క్రమముగా 2 నుంచి 4 డిగ్రీల సెంటి గ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉంది .
శుక్రవారం, శనివారం: వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెంటి గ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉంది.
కాగా పలు ప్రాంతాల్లో వడగాలులు కూడా వీస్తాయని ఏపీ విపత్తులు నిర్వహణ సంస్థ తెలిపింది.
రేపు కోనసీమ జిల్లాలోని పామర్రు మండలంలో తీవ్రవడగాల్పులు, 286 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 17 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 300 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల సంస్థ,ఎండి, డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.
286 మండలాల వివరాలుhttps://t.co/VZMmIlLRSq pic.twitter.com/WTTboyoXl0
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) June 1, 2023