Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

మొంథా తుఫాన్ తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల చెదురుమదురు వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరగడంతోపాటు.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
Weather Alert

Updated on: Nov 08, 2025 | 1:44 PM

మొంథా తుఫాన్ తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల చెదురుమదురు వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరగడంతోపాటు.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. నైరుతి బంగాళాఖాతం నుండి కేరళ వరకు శ్రీలంక – తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతుంది. నిన్నటి దక్షిణ అంతర కర్ణాటక – పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఈరోజు తక్కువగా గుర్తించబడింది. ఆంధ్రప్రదేశ్ – యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఉత్తర – ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-

శనివారం, ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:-

శనివారం, ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

రాయలసీమ:-

శనివారం, ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది.

తెలంగాణలో వాతావరణం ఎలా ఉంటుందంటే..

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానంగా ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీస్తున్నవి.. శనివారం, ఆదివారం, సోమవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ క్రమంలో వెదర్ డిపార్ట్మెంట్ మరో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9 నుంచి 14 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us