టెంపుల్ సిటీ తిరుపతిలో కత్తి కల్చర్ హడలెత్తించింది. స్థానిక PGR సినిమా థియేటర్‌లో జరిగిన అటాక్‌కి ప్రేమ వ్యవహారమే అని తేల్చారు పోలీసులు. కావ్య అనే అమ్మాయితో కలిసి సినిమాకు వెళ్లిన లోకేష్‌పై కార్తీక్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించారు. లోకేష్‌పై దాడి తర్వాత కార్తీక్, కావ్య థియేటర్ నుంచి బయటకు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఈ ఘటనకు సదరు యువతి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పల్లిగుంటిపల్లెకు చెందిన లోకేశ్ తిరుపతిలో పారామెడికల్ సెకండియర్ చదువుతున్నాడు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చెందిన కావ్య కూడా అదే కాలేజీలో చదువుతుంది. వీరిద్దరూ ప్రస్తుతం ప్రేమలో ఉన్నారు. అయితే కావ్య తనకు బంధువైన కార్తీక్‌తో ఐదేళ్లుగా ప్రేమ వ్యవహరం నడుపుతోంది. టెన్త్ వరకు చదువుకున్న కార్తీక్ ప్రస్తుతం జులాయిగా తిరుగుతున్నాడు. అతనితో ఆమె నిత్యం ఫోన్‌లో మాట్లాడుతూనే, మరోపక్క క్లాస్‌మేట్ లోకేశ్‌తోనూ ప్రేమ వ్యవహారం నడిపింది. పైగా ఒకరి విషయాలు మరొకరితో పంచుకుని, ఇద్దరి మధ్య కక్షలు పెరిగేలా చేసింది. శుక్రవారం కార్తీక్ తిరుపతికి రాగా, ఇద్దరూ కలిసి లోకేశ్‌పై దాడికి స్కెచ్ వేశారు. సినిమాకు వెళ్దామని చెప్పి లోకేశ్‌కూ, తనకు ముందు వరుసలో, కార్తీక్‌కు వెనుక వరుసలో వచ్చేలా ఆమె సినిమా టికెట్లు బుక్ చేసింది. దాడి తర్వాత ప్రేమికులు ఇద్దరూ బైక్‌పై శ్రీకాళహస్తి వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. నిందితులు కార్తీక్, కావ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తీవ్రంగా గాయపడిన లోకేష్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
సినిమా థియేటర్‌లో విద్యార్థిపై కత్తితో దాడి.. ప్రేమ వ్యవహారమే కారణమంటున్న పోలీసులు
తిరుపతి – పీజీఆర్ థియేటర్‌లో లోకేష్ అనే యువకుడిపై కత్తితో దాడి చేసిన కార్తీక్ అనే యువకుడు
కావ్య అనే యువతితో సినిమాకు వచ్చిన లోకేష్.. దాడి తర్వాత కార్తీక్‌తో వెళ్లిపోయిన యువతి కావ్య
లోకేష్‌కు… pic.twitter.com/AOhU9q3sVP
— Telugu Scribe (@TeluguScribe) September 14, 2024
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..