Andhra Pradesh Weather Report: పశ్చిమ-మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం అనగా దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్ర తీరంలో గల అల్పపీడనము బలపడుతోంది. దానితో పాటు అల్పపీడనానికి సంబంధించిన ఉపరితల ఆవర్తనము సగటు సముద్రమట్టానికి 5.8 కిమీ ఎత్తు వరకు ఉండి ఎత్తులో నైరుతి దిశకు వంగి ఉంది. దీని ప్రభావంతో, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో 15 అక్టోబర్ నుండి 16 అక్టోబర్ 2021 వరకు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
తూర్పు పశ్చిమ ద్రోణి ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 4.5 కి.మీ ఇంకా 5.8 కి.మీ.ల మధ్య ఎత్తులో ఉంది. ఇది దక్షిణ ద్వీపకల్ప భారతదేశం అంతటా సుమారు 14 ° N అక్షాశంము వద్ద కొనసాగుతోంది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన ఈ కింది విధంగా ఉంటాయని అమరావతిలోని వాతావరణశాఖ సంచాలకులు తెలియజేశారు.
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం :
ఈరోజు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తూర్పు గోదావరి జిల్లాలలో జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు పశ్చిమ గోదావరి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు, ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర :
ఈరోజు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ:
ఈరోజు రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
Read also: Maoist Leader RK: ఆర్‌కె మృతితో ఏవోబీలో మావోయిస్ట్ ఉద్యమం దాదాపు ముగిసినట్లే: పోలీస్ వర్గాలు