AP News: తిరుపతి రైల్వే స్టేషన్‌లో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. ఆగి ఉన్న ట్రైన్‌లోని ఓ బోగీని క్లీన్ చేసేందుకు పారిశుద్ధ్య కార్మికులు వెళ్లారు. లోపల కనిపించిన దృశ్యం చూసి వారు కంగుతిన్నారు. వెంటనే తేరుకుని అక్కడి నుంచి పరుగులు తీశారు. వారు అంతలా టెన్షన్ పడింది ఎందుకంటే అక్కడ కనిపించింది డెడ్‌బాడీ. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం ఉదయం శ్రీకాకుళం(Srikakulam) నుండి తిరుపతికి చేరిన ట్రైన్‌లోని జనరల్ బోగీలో ఈ మృతదేహాన్ని గుర్తించారు. పాసింజర్స్ అందరూ దిగిన తర్వాత బోగీని శుభ్రం చేయటానికి వెళ్లిన పారిశుద్ధ్య కార్మికులు డెడ్‌బాడీని గుర్తించి స్టేషన్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తిరుపతి స్టేషన్ అధికారుల కంప్లైంట్‌తో రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి వయస్సు 45-50 సంవత్సరాలుగా ఉంటుందని అంచనా వేశారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రి(Ruia Hospital)కి తరలించారు. ఈ కేసుకు సంబంధించి పలు కోణాల్లో విచారిస్తున్నారు. అతను ప్రమాదవశాత్తూ చనిపోయాడా.. లేక గుండెపోటుతోనా.. లేక ఎవరైనా చంపేశారా అని దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే.. ఆ డెత్ మిస్టరీ వీడనుంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..