Krishna District: అమానుషం.. గ్రామ పెద్దల మాట వినలేదని రెండు కుటుంబాల వెలివేత 

గ్రామ పెద్దల మాట వినలేదని రెండు కుటుంబాలను ఊరి నుంచి వెలివేశారు. ఆ రెండు కుటుంబాలతో ఎవరూ మాట్లాడకూడదని షరతులు విధించారు. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని, వాళ్లతో మాట్లాడిన వారి గురించి..

Krishna District: అమానుషం.. గ్రామ పెద్దల మాట వినలేదని రెండు కుటుంబాల వెలివేత 
Two Families Were Extraction From Village

Updated on: Jun 06, 2023 | 6:14 PM

కృష్ణా జిల్లా: గ్రామ పెద్దల మాట వినలేదని రెండు కుటుంబాలను ఊరి నుంచి వెలివేశారు. ఆ రెండు కుటుంబాలతో ఎవరూ మాట్లాడకూడదని షరతులు విధించారు. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని, వాళ్లతో మాట్లాడిన వారి గురించి చెప్పివారికి రూ.500 నజరానా ఇస్తామని గ్రామ పెద్దమనుషులు చాటింపు వేయించారు. ఈ అమానుష ఘటన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కృష్ణాజిల్లాలో చోటు చేసుకుంది.

కృష్ణాజిల్లా మోపిదేవి మండలం అన్నవరం గ్రామానికి చెందిన రెండు కుటుంబాలకు స్థల విషయమై వివాదం నెలకొంది. స్థల వివాదం ఆ ఊరి గ్రామ పెద్దల వద్దకు వచ్చింది. సమస్యను పరిష్కరించే క్రమంలో పెద్ద మనుషుల మాటను తిరస్కరించినందుకు తుమ్మ వెంకట సీతారామయ్య కుటుంబాన్ని గ్రామ పెద్దలు వెలివేస్తున్నట్లు చాటింపు వేయించారు. ఈ చాటింపును రావివారిపాలెం సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రామకృష్ణ అనే వ్యక్తి వీడియో తీశాడు (రామకృష్ణ కూడా అదే గ్రామానికి చెందిన వాడు). దీంతో ఆ కుటుంబాన్ని కూడా వెలివేస్తున్నట్లు గ్రామ పెద్దలు ప్రకటించారు. గ్రామం నుంచి వెలివేసిన రెండు కుటుంబాలతో మాట్లాడిన వారికి వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామని గ్రామ పెద్దలు ప్రకటించారు.

వారితో ఎవరైనా మాట్లాడితే రూ.1000 జరిమానా విధిస్తామని తెలిపారు. దీంతో వెలివేతకు గురైన రెండు కుటుంబాలు పోలీసులను ఆశ్రయించారు. రెండు కుటుంబాల వారు గ్రామ పెద్దలపై ఫిర్యాదు చేశారు. రెండు కుటుంబాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్రామ పెద్దలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చల్లపల్లి సీఐ రవికుమార్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.