AP News: మరికొద్ది రోజుల్లో పెళ్లి.. టీటీడీ ఈవో కుమారుడు మృతి.. ధర్మారెడ్డి దు:ఖించడం చూసి సీఎం ఎమోషనల్

చంద్రమౌళి రెడ్డి అకాల మరణంపై సీఎం జగన్‌ ధర్మారెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ధర్మారెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

AP News: మరికొద్ది రోజుల్లో పెళ్లి.. టీటీడీ ఈవో కుమారుడు మృతి.. ధర్మారెడ్డి దు:ఖించడం చూసి సీఎం ఎమోషనల్
Chief Minister YS Jagan Mohan Reddy extended his condolences to TTD Executive Officer AV Dharma Reddy on the sudden demise of his son Chandramouli Reddy.

Updated on: Dec 22, 2022 | 10:18 PM

మాయదారి కరోనా ఆనంతరం గుండెపోట్లు పెరిగిపోయాయి. అది చేసిన డ్యామేజో లేక స్ట్రస్ కారణమో తెలియదు కానీ ఈ మధ్య యంగ్ స్టర్స్ గుండెపోటు బారిన పడుతున్నారు. అప్పటివరకు బానే ఉన్నవారు అమాంతం ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా  టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి గుండెపోటుతో తుదిశ్వాస విడిచాడు. అతడికి  తీవ్ర గుండెపోటు రావడంతో హుటాహుటిన చెన్నైలోని కావేరీ హాస్పిటల్‌కు తరలించారు. డాక్టర్లు తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ.. 3 రోజుల అనంతరం  ఆరోగ్యం విషమించి మరణించాడు.

చంద్రమౌళి మృతిపై  సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  నంద్యాల జిల్లాలోని పారుమంచాల గ్రామానికి వెళ్లిన సీఎం.. ధర్మారెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. చంద్రమౌళి రెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎదిగొచ్చిన కొడుకు ఇలా వెళ్లిపోయాడంటూ దు:ఖించిన ఏవీ ధర్మారెడ్డిని చూసి సీఎం కూడా ఒకింత ఎమోషనల్ అయ్యారు.

చంద్రమౌళికి ఇటీవలే చెన్నైకు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్, పారిశ్రామికవేత్త,  TTD బోర్డు స్థానిక సలహా కమిటీ అధ్యక్షుడు ఏజే శేఖర్​ రెడ్డి కుమార్తెతో పెళ్లి కుదరింది. వీరి నిశ్చితార్థం జూన్ 9న తిరుమలలో నిరాడంబరంగా జరిగింది. ఆ వెడ్డింగ్ కార్డ్స్ పంచడానికి చెన్నై వెళ్ళిన సమయంలోనే చంద్రమౌళికి గుండెపోటు వచ్చింది. ఈ జనవరిలో చంద్రమౌళి తిరుమలలో పెళ్లి జరగాల్సి ఉండగా ఈ విషాదం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.