Andhra Pradesh: ఏపీ పంచాయతీ ఎన్నికల అంశంలో మరో ట్విస్ట్.. సుప్రీంకోర్టు సమయం ముగియడంతో..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను నిలిపివేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్ వేసిన పిటిషన్‌పై..

Andhra Pradesh: ఏపీ పంచాయతీ ఎన్నికల అంశంలో మరో ట్విస్ట్.. సుప్రీంకోర్టు సమయం ముగియడంతో..

Updated on: Jan 22, 2021 | 1:33 PM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను నిలిపివేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్ వేసిన పిటిషన్‌పై సందిగ్ధత నెలకొంది. కోర్టు సమయం ముగియడంతో అత్యవసర విచారణకు నేడు సమయం దొరకలేదు. దాంతో ఏపీ సర్కార్ మరో ఆలోచన చేస్తోంది. శనివారం నాడే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో హౌస్ మోషన్ దాఖలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. కాగా, స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలును నిలిపేయాలని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌లో అత్యవసర విచారణ కోరుతున్నట్లు మెన్షన్ చేసింది ప్రభుత్వం. అయితే, నేడు కోర్టు సమయం ముగియడంతో ఏపీ సర్కార్‌‌ సందిగ్ధంలో పడింది.

ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఉత్తర్వులను నిలిపివేస్తూ సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసిన విషయం తెలిసిందే. అలాగే ఎస్ఈసీ నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికల ప్రక్రియను కొనసాగించవచ్చునని హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు కూడా చేసింది. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

Also read:

Minister Sabitha Indra Reddy: ప‌్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో నాణ్య‌మైన విద్య అందిస్తున్నాం… ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌ అమ‌లు…

Tokyo Olympics: ఈసారి ఒలింపిక్స్‌ లేనట్లేనా.. క్రీడలను రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోన్న జపాన్‌..?