Andhra Pradesh – PRC: ఇప్పుడు మాట మార్చడం సరికాదు.. ఉద్యోగ సంఘాల తీరుపై సజ్జల కామెంట్స్..

|

Jan 28, 2022 | 8:18 PM

Andhra Pradesh - PRC: పీఆర్సీ వ్యవహారం, ఉద్యోగుల ఆందోళనలపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చిట్ చాట్ చేశారు.

Andhra Pradesh - PRC: ఇప్పుడు మాట మార్చడం సరికాదు.. ఉద్యోగ సంఘాల తీరుపై సజ్జల కామెంట్స్..
Sajjala Ramakrishna Reddy
Follow us on

Andhra Pradesh – PRC: పీఆర్సీ(PRC) వ్యవహారం, ఉద్యోగుల(Employees) ఆందోళనలపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి(Sajjala Ramakrishna Reddy) చిట్ చాట్ చేశారు. కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు జనవరి నెల వేతనాలు చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలకు, ఉద్యోగ సంఘ నాయకులు పెట్టిన మూడు డిమాండ్లకు ఏ సంబంధం లేదని అన్నారు. ముఖ్యమైన హెచ్ఆర్ఏ సవరణ అంశాన్ని ఉద్యోగ సంఘాలు ప్రస్తావించటం లేదని సజ్జల పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలు మంత్రుల కమిటీతో చర్చలకు వస్తే పాత జీతాలు వేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించి ఉండేదన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి. కొత్త పేస్కేళ్లతో వేతన బిల్లులను రూపోందిస్తున్న డీడీఓలను పనిచేసుకోనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఉద్యోగ సంఘాలపై సజ్జల అసంతృప్తి వ్యక్తం చేశారు.

హెచ్ఆర్ఏ శ్లాబులపై నష్టం జరుగుతుందని ఉద్యోగ సంఘాలు భావిస్తే దానిపై చర్చించడానికి మంత్రుల కమిటీ సిద్ధమేనని సజ్జల తెలిపారు. ఉద్యోగ సంఘాల కంటే ఎక్కువే ఉద్యోగుల బాగోగుల గురించి ప్రభుత్వం ఆలోచించిందని, పదే పదే చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడామని ఆయన అన్నారు. ఆర్ధిక సమస్యల కారణంగా ఒకటీ రెండు అంశాలపైనే దృష్టి పెట్టాలని ఉద్యోగ సంఘాలకు ముందే చెప్పామన్నారు. ప్రాధాన్యత దృష్ట్యా ఫిట్మెంట్ పై నిర్ణయమే కీలకమని ఉద్యోగ సంఘాలు చెప్పాయన్నారు. ఇప్పుడు మాటమార్చి మరోలా వ్యవహరించటం సరికాదని ఉద్యోగుల తీరుపై సజ్జల అసంతృప్తి వ్యక్తం చేశారు.

Also read:

Gangubai Kathiawadi: థియేటర్లలోకి గంగూబాయి కతియావాడి.. అలియా భట్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

Telangana: తెలంగాణలో విద్యా వికాసానికి అడ్డుపడుతున్న కేంద్రం.. వినోద్ సంచలన ఆరోపణలు..

TDP – Chandrababu: వాటి నుంచి దృష్టి మరల్చేందుకే తెరపైకి కొత్త డ్రామాలు.. ప్రభుత్వంపై బాబు ఫైర్..