Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇండస్ట్రీయల్ ప్రమోషన్ ఆఫీసర్ల కొరత ఉన్న కారణంగా గ్రామ, వార్డు సచివాలయాలలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. డైరక్టర్ అఫ్ ఇండస్ట్రీస్ ఇచ్చిన ప్రతిపాదనల మేరకు సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఇండస్ట్రీయల్ ప్రమోషన్ ఆఫీసర్లుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
దీనితో ఇకపై ఇంజనీరింగ్ అసిస్టెంట్లు రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల క్షేత్రస్థాయి సర్వేలను చేపట్టనున్నారు. పరిశ్రమలకు అనువైన ప్రాంతాలను గుర్తించడమే కాకుండా.. విద్యుత్ వినియోగం, రెవిన్యూ, ఉపాధి కల్పన వంటి అంశాలను సేకరించి ఎప్పటికప్పుడు మొబైల్ యాప్‌లో నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ అసిస్టెంట్లను సూచించింది. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ఆదేశించింది.
Also Read:
మెగాస్టార్ చిరంజీవికి కరోనా నెగటివ్.. కాలం, కరోనా నన్ను కన్ఫ్యూజ్ చేశాయంటూ ట్వీట్..
పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పరీక్షలపై కీలక నిర్ణయం.!
రైలు ప్రయాణీకులకు ముఖ్య గమనిక.. 12 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. వివరాలివే..!
ఏపీ: సీఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్.. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ గడువు పొడిగింపు..
కూతురు పుట్టింది.. అదృష్టాన్ని తెచ్చింది.. మురిసిపోతున్న యువ పేసర్ నటరాజన్..