భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఇటీవల ఏపీలో పర్యటించిన ఆమె.. ఘనంగా సన్మానం అందుకున్నారు. పోరంకిలో ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సన్మానం చేశారు. ఆమె మూడు రోజుల పాటు విజయవాడ, విశాఖ, తిరుపతిల్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక ఇప్పుడు నంద్యాల జిల్లాలోని శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకోనున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలానికి ఎంతో ప్రత్యేకత ఉంది.
ఈ నెల 26వ తేదీన ఆమె శ్రీశైలంలో పర్యటించనున్నారు. 12:15 గంటలకు శ్రీశైలం చేరుకోనున్న రాష్ట్రపతి.. మధ్యాహ్నం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అలాగే కేంద్ర టూరిజంశాఖ ద్వారా దేవస్థానం చేపట్టిన ప్రసాదం స్కీమ్ పనులను ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా పుణ్యక్షేత్రాలను పూర్తి స్థాయిలో డెవలప్ చేయనున్నారు. టూరిస్టులను ఆకర్షించేందుకు వీలుగా మరిన్ని సౌకర్యాలను కల్పించనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి