Andhra Pradesh: 3 టన్నుల బరువున్న బొక్కు సొర చేపకు అంత్యక్రియలు.. దీని ప్రత్యేకతలు మీకు తెలుసా..?

|

Jul 11, 2022 | 7:52 PM

సముద్ర జలాలను శుద్ధిచేసి, మత్య్స సంపదను కాపాడే నైజం బొక్కు సొర చేపకు ఉందని, మత్య్సకారుల్లో అవగాహన కల్పిస్తున్నారు అధికారులు. వలలో చిక్కిన చేపను తిరిగి నీటిలో వదిలేస్తే పరిహారం కూడా ఇస్తున్నారు.

Andhra Pradesh: 3 టన్నుల బరువున్న బొక్కు సొర చేపకు అంత్యక్రియలు.. దీని ప్రత్యేకతలు మీకు తెలుసా..?
whale shark fish
Follow us on

Viral Video: కాకినాడ జిల్లా(kannada District)లో విషాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ బీచ్ సముద్ర తీరానికి ప్రాణాలు కోల్పోయిన ఓ భారీ బొక్కు సొర చేప కొట్టుకువచ్చింది. అటవీశాఖ, వైల్డ్ లైఫ్ అధికారులు జేసీబీ సాయంతో బీచ్‌లో గొయ్యి తవ్వి దానికి అంత్యక్రియలు చేశారు. ఈ అరుదైన సొర చేప సుమారు 25 అడుగుల పొడవు ఉంది. మూడు టన్నుల బరువు ఉంటుందని అధికారులు తెలిపారు. సాగర జలాలను శుభ్రపరిచి, మానవాళికి ఎంతో మేలు చేస్తుంది ఈ చేప. పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదపడే బొక్కు సొర చేపను చంపినవారికి ఏడు సంవత్సరాల జైలుశిక్ష, రూ.50వేల జరిమానా విధించవచ్చని చట్టంలోని షెడ్యూల్ 1 చెబుతుంది. కాగా ఈ చేప ద్వారా వచ్చే ఆయిల్‌ను విదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చన్న కారణంతో కొందరు వధించడం బాధ కలిగించే అంశం. వలలో చిక్కిన ఈ చేపను విడిచిపెట్టే మత్స్యకారులకు మత్స్యశాఖ ద్వారా అటవీశాఖ పరిహారం కూడా అందజేస్తుంది. బొక్కు సొర చేప సముద్రాన్ని శుభ్రం చేసే స్కావెంజర్ మాదిరిగా పనిచేస్తుంది.  ప్రకృతి సంరక్షణ అంతర్జాతీయ సంఘం (ఐయూసీఎన్) ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నట్టు గుర్తించిన ఏడు రకాల తిమింగలాల్లో ఇది ఒకటి. ఇంగ్లీషులో వేల్‌షార్క్‌గా పిలిచే అతి పెద్ద తిమింగలం జాతి చేప బొక్కు సొర. దీనిని పులి బొక్కు సొర అని కూడా అంటారు.  అతి పెద్దదైన బొక్కుసొర చేప పూర్తి శాకాహారి అవ్వడం ఆశ్చర్యకరమైన విషయం. మొక్కలు, నాచును ఇది తింటుంది. ఈ చేప దాదాపు 100 సంవత్సరాలు జీవిస్తుందని అధికారులు చెబుతున్నారు.

భారీ బొక్కు సొర చేపకు అంత్యక్రియలు చేసిన వీడియోను దిగువన చూడండి…

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..