Ramadan month: రంజాన్ నెల ప్రారంభానికి ముందే ముస్లిం ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్…

రంజాన్ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ముస్లిం ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 

Ramadan month: రంజాన్ నెల ప్రారంభానికి ముందే ముస్లిం ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్...
Cm Jagan For Muslims

Updated on: Apr 12, 2021 | 5:50 PM

రంజాన్ నెల ప్రారంభానికి ముందే ముస్లిం ఉద్యోగులకు సీఎం జగన్ నేతృత్వంలోని ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.  విధుల నుంచి గంట ముందుగా ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.  ఏప్రిల్ 14 నుంచి  మే 13 వరకు గంట ముందుగా ఇంటికి వెళ్లే అవకాశం కల్పించింది.  రంజాన్ నెలలో ముస్లింల ఉపవాస దీక్షల సందర్భంగా  ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, వార్డు, గ్రామ వాలంటీర్లు, సచివాలయ ముస్లిం ఉద్యోగులకు.. ఇది వర్తిస్తుందని సర్కూలర్ జారీ చేశారు.   కోవిడ్ నిబంధనలతో రంజాన్ వేడుకలు నిర్వహించుకోవాలని సర్కార్ సూచించింది. ఈ రంజాన్ మాసంలో ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు ఉండి… అల్లాను ఆరాధిస్తారు. అత్యంత నిష్టతో దర్గాల్లో సామూహిక ప్రార్థనలు చేస్తారు. అందుకే వారి ప్రార్థనలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

రంజాన్ మాసానికి ఇస్లాంలో అత్యంత ప్రాధాన్యత ఉంది. ముస్లిం దివ్య గ్రంథమైన పవిత్ర ఖురాన్ ఈ మాసంలోనే దివి నుంచి భువిపై అవతరించినందని.. అందుకే ఇంత ప్రాధాన్యత అని ముస్లిం మత గురువులు చెబుతారు. కాగా క్యాలెండర్ ప్రకారం  ఈ ఏడాది రంజాన్ పండుగ మే 12న ఉంది. అయితే నెలవంకను బట్టి పండుగ జరుపుకునే తేదీని మత పెద్దలు నిర్ణయిస్తారు.

Also Read: పెరట్లో పేడ దిబ్బ తొలగిస్తుంటే… చేతికి అస్థిపంజరం తగిలింది.. ఆరా తీయగా షాకింగ్ ట్విస్ట్

ప్రపంచంలో ఇది అత్యంత విషపూరితమైన పుట్టగొడుగు.. దీన్ని తాకినా కూడా ఔట్

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us