
టీడీపీ(TDP), చంద్రబాబుపై ఏపీ మినిస్టర్ రోజా(AP Minister Roja) ఫైర్ అయ్యారు. మహిళా రక్షణ గురించి మాట్లాడే అర్హత ఆ పార్టీకి లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్(CM Jagan) పాలనలో మహిళలందరూ ఆనందంగా ఉన్నారని.. మహిళలకు 50 శాతం రిజ్వేషన్లు ఇచ్చి వారు ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేలా చేశారని చెప్పారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి సహించలేక చంద్రబాబు ప్రస్టేషన్ తో రగిలిపోతున్నారని ఎద్దేవా చేశారు. విజయవాడ జీజీహెచ్ లో మానసిక వికలాంగురాలిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై అనవసర రాజకీయాలు చేస్తున్నారన్నారు. బాధితురాలికి అండగా ఉండకుండా ఈ ఘటనను రాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఇలా చేసే వాళ్లను శిక్షించడానికి కొత్త చట్టం తీసుకురావాలని కోరారు. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పైనే దాడికి ప్రయత్నించారన్న రోజా.. టీడీపీ నేతలు మహిళలపై దాడులు చేసేందుకూ వెనుకాడటం లేదని విమర్శించారు.
చంద్రబాబు మహిళా ద్రోహి. టీడీపీలో ఉన్న ఉన్మాదుల కంటే ఎవరూ ఎక్కువ కాదు. అందరికంటే పెద్ద ఉన్మాది చంద్రబాబు. జగన్, భారతి లను తప్పుగా మాట్లాడితే సహించేది లేదు. సొంతగా పార్టీ పెట్టుకోకుండా ఎన్టీఆర్ పార్టీని లాకున్న చంద్రబాబు చీర కట్టుకోవాలి. కొడుకును ఎమ్మేల్యేగా గెలిపించుకొలేకపోయినందుకు తండ్రీకొడుకులు పచ్చ చీరలు కట్టుకోవాలి. చీరలు కావాలో.. చుడీదార్ లు కావాలో వాళ్లే నిర్ణయించుకోవాలి.
– ఆర్కే రోజా, ఏపీ పర్యాటకశాఖ మంత్రి
మహిళా రక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పార్లమెంట్ కీర్తించిందని మంత్రి రోజా చెప్పారు. మహిళా రక్షణ కోసం చంద్రబాబు ఒక్క చర్య కూడా తీసుకోలేదని.. జగన్ దమ్మెంటో 12 ఏళ్లుగా చూస్తున్నారు కదా కొత్తగా ఇంకేం చూస్తారని ఎద్దేవా చేశారు. ఒక్క ఎమ్మేల్యే నుంచి 151 ఎమ్మెల్యే వరకూ వైసీపీ ఎదిగిన తీరు చూడలేదా అని ప్రశ్నించారు. టీడీపీని 23 సీట్లకు పరిమితం చేసినప్పుడు తెలియలేదా అని అడిగారు. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం కూడా వృథా ప్రయాసేనని మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి
Minister Harish Rao: జాతీయ రాజకీయాల్లో TRS కీలక పాత్ర.. మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు