Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు

Vallabhaneni Vamsi: ఇదిలా ఉండగా, నకిలీ ఇళ్ల పట్టాల కేసులో జూన్‌ 12 వరకు వల్లభనేని వంశీ రిమాండ్‌‌ను కోర్ట్ పొడిగించింది. ఇక అనారోగ్యం కారణంగా ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యానికి అనుమతివ్వాలంటూ వంశీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని..

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు

Updated on: May 29, 2025 | 7:50 PM

బెయిల్.. అయినా తప్పదు జైలు అన్నట్టుగా వల్లభనేని వంశీ పరిస్థితి తయారైంది. ఓ కేసులో బెయిల్ వచ్చినా.. మరో కేసులో జైలులో ఉండాల్సి వస్తోంది. అక్రమ మైనింగ్‌ కేసులో వల్లభనేని వంశీకి హైకోర్టు ముందస్తు బెయిల్‌ ఇచ్చింది. గన్నవరం పోలీసులు నమోదు చేసిన కేసులో ఈ ముందస్తు బెయిల్ లభించింది.

నకిలీ ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్‌ పొడిగింపు

ఇదిలా ఉండగా, నకిలీ ఇళ్ల పట్టాల కేసులో జూన్‌ 12 వరకు వల్లభనేని వంశీ రిమాండ్‌‌ను కోర్ట్ పొడిగించింది. ఇక అనారోగ్యం కారణంగా ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యానికి అనుమతివ్వాలంటూ వంశీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జూన్ 2కు కోర్ట్ వాయిదా వేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి