Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TDP Mahanadu: మహానాడు వేదికగా వైసీపీపై విరుచుకుపడిన నారా లోకేష్

TDP Mahanadu: మహానాడు వేదికగా వైసీపీపై విరుచుకుపడిన నారా లోకేష్

Subhash Goud

|

Updated on: May 29, 2025 | 8:12 PM

Nara Lokesh: చంద్రబాబు అంటే నాడు హైటెక్ సిటీ.. నేడు క్వాంటమ్ వ్యాలీ అని, టీడీపీ శ్రేణులు, నేతలు అహంకారం పక్కనపెట్టి ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. మూడు పార్టీలు కలిసినప్పుడు చిన్న చిన్న సమస్యలు రావడరం సహజమన్న లోకేష్‌.. ఎవరు కూడా ఈగోలకు పోయి విమర్శలు చేసుకోవద్దన్నారు.

మహానాడు వేదికగా వైసీపీపై విరుచుకుపడ్డారు మంత్రి లోకేష్. తల్లిని, చెల్లిని మెడపట్టి బయటకు గెంటేసింది ఎవరు? బాబాయ్‌ను చంపేసింది ఎవరంటూ ప్రశ్నించారు. రెడ్‌బుక్ అంటే వైసీపీ నేతలు వణికిపోతున్నారంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబును బంధించి గత పాలకులు సంబరపడ్డారు. కానీ వారిని ప్యాలస్‌లో పెట్టి ప్రజలు తాళం వేశారన్నారు మంత్రి లోకేష్. చంద్రబాబు అంటే నాడు హైటెక్ సిటీ.. నేడు క్వాంటమ్ వ్యాలీ అని, టీడీపీ శ్రేణులు, నేతలు అహంకారం పక్కనపెట్టి ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. మూడు పార్టీలు కలిసినప్పుడు చిన్న చిన్న సమస్యలు రావడరం సహజమన్న లోకేష్‌.. ఎవరు కూడా ఈగోలకు పోయి విమర్శలు చేసుకోవద్దన్నారు.

Published on: May 29, 2025 08:06 PM