ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. బియ్యం డోర్ డెలివరీ ట్రయల్ రన్‌..

| Edited By: Pardhasaradhi Peri

Jun 07, 2020 | 12:48 PM

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. రేషన్ దుకాణాల ద్వారా బియ్యాన్ని డోర్ డెలివరీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల సమయంలో బియ్యాన్ని డోర్ డెలివరీ చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో సెప్టంబర్ 1 నుంచి బియ్యాన్ని డోర్ డెలివరీ చేసేందుకు..

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. బియ్యం డోర్ డెలివరీ ట్రయల్ రన్‌..
Follow us on

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. రేషన్ దుకాణాల ద్వారా బియ్యాన్ని డోర్ డెలివరీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల సమయంలో బియ్యాన్ని డోర్ డెలివరీ చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో సెప్టంబర్ 1 నుంచి బియ్యాన్ని డోర్ డెలివరీ చేసేందుకు.. ఈ నెల 8న ట్రయల్ రన్ ప్రారంభం కానుంది. బియ్యం నాణ్యత, పంపిణీలో పారదర్శకత, అవినీతికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయాలనుకుంటోంది. ఈ కార్యక్రమాన్ని గ్రామ వాలంటీర్లు నిర్వర్తించనున్నారు.

మొబైల్ వాహనాల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే తీసుకు వెళ్లి బియ్యం సరఫరా చేయనున్నారు. ఇప్పటికే తయారు చేసిన కొన్ని యూట్లను సోమవారం రోజు ట్రయల్ రన్ చేయనున్నట్లు ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా 13,370 మొబైల్ యూనిట్లను అందుబాటులోకి తెచ్చేందుకు టెండర్లను పిలుస్తామని తెలిపారు అధికారులు. కాగా బియ్యం డోర్ డెలివరీ విధానం ఇప్పటికే శ్రీకాకుళం అమలు చేస్తోంది ఏపీ సర్కార్. లబ్ధిదారుల ముందే బియ్యం బస్తా సీల్ ఓపెన్ చేసి రేషన్ ఇస్తారు. బియ్యం కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన బ్యాగులను ముందే ఇవ్వనున్నారు.

Read More:

ఈ నెల 16 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

వామ్మో.. 70 లక్షలకు చేరువలో కరోనా కేసులు..

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ..

సీరియల్స్‌లో నటించే.. అన్నాచెల్లెలు ఆత్మహత్య