
మత్య్సకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. మత్య్సకారులకు సేవలో పథకం కింద రూ.20 వేలను లబ్దిదారుల అకౌంట్లో జమ చేసింది. మత్స్యకారులకు ఒక్కో కుటుంబానికి రూ.20 వేలను అందించింది. మంగళవారం నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో జరిగిన సభలో సీఎం చంద్రబాబు స్వయంగా వీటిని విడుదల చేశారు. రూ.262 కోట్ల నిధులను లబ్దిదారుల అకౌంట్లో వేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. చరిత్రలో తొలిసారి రూ.262 కోట్ల నిధులను మత్య్సకారుల అకౌంట్లో జమ చేసినట్లు తెలిపారు. మత్స్యకారులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. చేపల వేటపై నిషేధం అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వం ఆదుకుంటుందని పేర్కొన్నారు. బోటు మనదే.. వేట మనదే అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సాయాన్ని పెంచలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారీగా పెంచామని స్పష్టం చేశారు. జువ్వలదిన్నె హార్బర్‌ను త్వరలో పూర్తి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా అనే విషయాన్ని సులువుగా చెక్ చేసుకోవచ్చు. ఇందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి. లేదా మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్ చెక్ చేసుకోవాలి. దీని ద్వారా మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదా అనేది తెలుసుకోవచ్చు. అలాగే గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి సంక్షేమ అధికారిని సంప్రదించాలి. మీ ఆధార్ కార్డు నెంబర్ ఆధార్ స్టేటస్ చెక్ చేస్తారు. ఇక మీ సమీపంలోని జిల్లా మత్స్యకార కార్యాలయంకి వెళ్లి పేమెంట్ స్టేటస్ చూడవచ్చు.
ఇక లబ్దిదారుల జాబితాలో మీ పేరు ఉందా..? లేదా? అనేది సులువుగా తెలుసుకోవచ్చు. గ్రామ, వార్డు సచివాలయలను సందర్శించడం ద్వారా తెలుసుకోవచ్చు. లేదా మత్స్యకార కార్యాలయాలను సందర్శించడం వల్ల కూడా మీరు వివరాలు తెలుసుకోవచ్చు. ఒకవేళ లబ్దిదారుల జాబితాలో ఉండి మీకు డబ్బులు పడకపోతే ఈకేవైసీ పూర్తి చేయండి. గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి ఈకేవైసీ పూర్తి చేయండి. దీంతో వెంటనే మీ డబ్బులు అకౌంట్లో జమ అవుతాయి.