
ఏపీలోని విద్యార్థులకు కూటమి సర్కార్ భారీ గుడ్‌న్యూస్ అందించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ఒకేసారి విడుదల చేసింది. దాదాపు రూ.1200 కోట్ల బకాయిలను మంగళవారం విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్ధికశాఖ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా విద్యార్థులకు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల ఫీజు బకాయిలు పెండింగ్‌లో ఉండటం వల్ల కొన్ని విద్యాసంస్థలు పరీక్షల హాల్ టికెట్లను ఇవ్వడం లేదు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థులు కోర్సు పూర్తైన తర్వాత సర్టిఫికేట్లు కూడా అందించడం లేదు.
ఈ క్రమంలో కాలేజీలు విద్యార్థులకు హాల్ టికెట్లు, సర్టిఫికేట్ల విషయంలో ఇబ్బందులు పెట్టకుండా ఉండేందుకు ప్రభుత్వం బకాయిలను ఇవాళ విడుదల చేసింది. ప్రస్తుతం రూ.7 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిల్లో రూ.1200 కోట్లను తాజాగా విడుదల చేసింది. వైసీసీ ప్రభుత్వం నుంచి ఈ బకాయిలు పెండింగ్‌లో ఉంటూ వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరకొరగా అప్పుడప్పుడు విడుదల చేయగా.. ఇప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో విడుదల చేసింది. ఇప్పుడు ఎట్టకేలకు ప్రభుత్వం విడుదల చేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా పోస్ట్ మెట్రిక్ కోర్సులు చేసే విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేస్తోంది. జ్ఞానభూమి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ విద్యార్థులకు అందిస్తున్నారు. కాలేజీలకు వీటిని అందిస్తున్నారు. ఇక ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ ఆపైన విద్యార్థులకు రూ.20 వేలు ట్యూషన్, హాస్టల్ ఖర్చుల రూపంలో తల్లిదండ్రుల అకౌంట్లో జమ చేస్తున్నారు. గత కొంతకాలంలగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు పెండింగ్‌లో ఉండటంతో ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా అని విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలు వేచి చూస్తున్నాయి. పలుమార్లు ప్రభుత్వానికి కాలేజీ యాజమాన్యాలు రిక్వెస్ట్ కూడా పెట్టుకున్నాయి. కాలేజీ నిర్వహణ ఖర్చుల కోసం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. ప్రభుత్వం ఎట్టకేలకు వారి డిమాండ్‌తో గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యార్థులు ఊరట కలిగినట్లయింది.